ఓట్లు పడొచ్చని కేటీఆర్‌ భావించారేమో..

కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందన

అనంతపురం: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఏపీ బాగాలేదు..తెలంగాణ బాగుందంటే.. ఓట్లు పడొచ్చని కేటీఆర్‌ భావించాడేమోనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఏపీలో విద్యుత్‌ కోతలు లేవని స్పష్టంచేశారు. బొగ్గు అధికంగా కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చని, ఏపీ కంటే తెలంగాణ బాగుందంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడొచ్చని భావించాడేమోనని ఎద్దేవా చేశారు. 

Back to Top