తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల హమీలన్నీ పూర్తిస్ధాయిలో అమలు చేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచారు. అందులో ప్రధానంగా నవరత్నాలు...నవరత్నాల హమీలన్నీ కూడా పూర్తిస్ధాయిలో అమలుచేశారు, కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర ఇబ్బందులతో సంక్షేమ పథకాలు ఇవ్వని వారిలో అర్హులు ఉంటే వారికి కూడా ఇచ్చే కార్యక్రమం ఇది. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు అప్రూవ్ చేసిన వారికే ఇచ్చే పరిస్ధితి ఉండేది, పార్టీలు చూసేవారు, పార్టీలకు అతీతంగా మన సీఎంగారు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులైతే చాలు పథకాలు చేరాలన్న ఉద్దేశ్యంతో డీబీటీ క్రింద బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకే ఇస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా సోషల్ ఆడిట్ కూడా చేయిస్తూ పూర్తిస్ధాయిలో అర్హులందరికీ ఇస్తున్నాం. మన ప్రియతమ సీఎంగారు వెల్ఫేర్ క్యాలెండర్ చెప్పినట్లుగా చెప్పిన తేదీ రోజు మాట మేరకు ఆ రోజే ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పద్దతిలో కొనసాగుతుంది. ఈ రోజు విడుదల చేస్తున్న దాంట్లో ప్రధానంగా వైయస్సార్ చేయూత, సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా ఈ మూడు పథకాల క్రింద ఎక్కువమంది లబ్ధిపొందుతున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల హమీలు ఏం అమలుచేశారు అనేది ప్రజలు గమనించారు, కానీ సీఎం శ్రీ వైయస్ జగన్ గారు మాట ఇస్తే అమలుచేస్తారని ప్రజలు భావించి రికార్డు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ప్రజల హృదయాలలో మరింత పదిలమైన స్ధానాన్ని సీఎంగారు ఏర్పాటుచేసుకున్నారు. అర్హులైన వారికి అన్ని పథకాలు అందాలంటే జిల్లా స్ధాయి అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి వారికి సద్వినియోగం అయ్యేలా అందరం పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. నిజంగా మాకు ఈ రోజే సంక్రాంతి పండుగ : ఝాన్సిరాణి, లబ్ధిదారు, కోతమూరు, రాజమండ్రి రూరల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా నమస్తే అన్నా, మీరు పాదయాత్రలో ఇచ్చిన హమీ డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ మాకు మొదటి విడతలో, రెండో విడతలో రాలేదు, మేం నిరుత్సాహపడ్డాం, కానీ మీరు నెలరోజుల్లో దరఖాస్తు పెట్టుకోమని చెప్పడంతో మేం మరోసారి అప్లై చేశాం, ఇప్పుడు మాకు రెండు విడతల డబ్బు రూ. 1.52 లక్షలు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకు ఈ రోజే సంక్రాంతి పండుగ అన్న అంత ఆనందంగా ఉంది. మీరు చేసే మంచి కార్యక్రమాలను కొంతమంది విమర్శిస్తున్నారు అన్నా, అయినా మేం అవన్నీ పట్టించుకోము. ఎందుకంటే మేం మా ఇంట్లో అందరం అన్ని పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నాం, మేం మీ వెనకే ఉన్నామన్నా, మిమ్మల్ని మా మహిళలంతా మళ్ళీ మళ్ళీ సీఎంగా కావాలని, మా మహిళలకు ఇలాంటి మంచి పనులు చేయాలని మేం కోరుకుంటున్నాం, ధ్యాంక్యూ అన్నా. చాలా సంతోషంగా ఉంది: శారదమ్మ, లబ్థిదారు, ప్రకాష్ నగర్, వైయస్ఆర్ కడప జిల్లా నమస్తే అన్నా, నేను గత 10 సంవత్సరాలుగా కడప జిల్లాలో నివసిస్తున్నాను. నాకు అప్పటినుంచి రైస్ కార్డు మనుగడలో ఉంది, కానీ మా రైస్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని డిలీట్ చేశారు, దాంతో మేం సచివాలయంకు వెళ్ళి ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేరని, నా భర్త కార్ డ్రైవర్, నేను, నా పిల్లలే అని మళ్ళీ దరఖాస్తు చేయడంతో వారు వెరిఫై చేసి శాంక్షన్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో రేషన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు నేరుగా ఇంటికే వచ్చి అన్నీ ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవధుల్లేవు: గుంటూరి ఏడుకొండలు, లబ్ధిదారు, మండువవారి పాలెం, ప్రకాశం జిల్లా అన్నా మీ పాలనలో ఈ ప్రకాశం జిల్లా వండర్‌ఫుల్‌గా ఉంది. అన్నా నాకు వైఎస్సార్ చేయూత పథకం క్రింద నాకు రెండేళ్ళుగా డబ్బు పడలేదు, ఎందుకు పడలేదంటే నీకు పుట్టినరోజు ప్రకారం ఐదు రోజులు తక్కువగా ఉందని వలంటీర్ చెప్పాడు. ఈ సారి పడ్డాయి, రాత్రి వలంటీర్ ఫోన్ చేసి కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్ళాలని చెప్పాడు, ఎందుకు అని అడిగితే నీకు చేయూత పథకం క్రింద డబ్బు వచ్చిందన్నాడు, నా ఆనందానికి అవధుల్లేవు. మీరు ఇచ్చే ఈ డబ్బుకి అదనంగా నేను డ్వాక్రా లోన్ తీసుకుని నా షాప్ డెవలప్ చేసుకుంటాను. నా కొడుక్కి విద్యాదీవెన డబ్బు వచ్చింది, నా పిల్లలకు ఆటిజమ్ ప్రాబ్లమ్ వల్ల పెన్షన్ వస్తుంది. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలను మీరు ఎంతో ఆదుకుంటున్నారు, మేం బ్రతికున్నంత కాలం మీరే సీఎంగా ఉండాలి. ఒక్క మాటతో చెప్పలేను. మీ వల్ల వేలాదిమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషంలో నాకు మాటలు రావడం లేదు, అన్ని పథకాలు మాకు అందుతున్నాయి, మా ఇంట్లో మీ ఫోటో కూడా ఉంది, మేం మిమ్మల్ని దేవుడిలా కొలుస్తామన్నా. పుట్టింటి నుంచి నేను డబ్బు తేలేకపోయినా, నా జగనన్న నాకు డబ్బు ఇస్తున్నాడని నేను గర్వంగా చెప్పగలను. వందనాలు అన్నా...