అక్టోబర్‌ 2న‌ ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’

ప్రజల కోసమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 2న ‘ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ – జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడతారని చెప్పారు. విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రజల కోసమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ లేదని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే చేరుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏం చేసినా కుట్రపూరితంగానే ఉంటుందన్నారు. 
 

Back to Top