విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో పోరాడుతున్నా..

బాబు అంత పిరికిపంద ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండరు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో పోరాటం చేస్తున్నానని, బాబు లాంటి నీతిమాలిన నాయకుడు ఈ దేశంలోనే ఎవరూ ఉండరని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డది అన్నారు. చంద్రబాబు తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉన్న చంద్రబాబు.. రౌడీ రాజ్యం అని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 5 కోట్ల ప్రజలంతా రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని సంతోషంగా ఉన్నారన్నారు. గత 40 సంవత్సరాలుగా చంద్రబాబుతో పోరాటం చేస్తున్నానని చెప్పారు. తనను ఏమీ చేయలేక.. తన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అకారణంగా 15 రోజులు జైల్లో పెట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు అంత పిరికిపంద ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండరన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top