చంద్రబాబు స్ర్కిప్ట్ నే రఘురామకృష్ణంరాజు చదువుతున్నాడు

 రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

  వైయస్‌ఆర్‌సిపి గుర్తుపై గెలిచి శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు 
 
ఆయనకు సిగ్గూ, శరం వుంటూ ఎంపి పదవికి రాజీనామా చేయాలి 
 
వేలకోట్లు బ్యాంకులను మోసం చేసిన చరిత్ర ఆయనది

 సీఎం  వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు 

 నేను మాట్లాడిన దానిని వందశాతం వక్రీకరించి తప్పుడు కథనాలు ప్రసారం చేశారు
  
జాతీయస్థాయిలో అత్యుత్తమ సీఎంగా జగన్ గారు ఎదురుతున్నారు*
 
ఓర్వలేని తనంతో చంద్రబాబు రగిలిపోతున్నారు.

తిరుప‌తి:  ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాసిన స్క్రిప్ట్‌నే చ‌దువుతున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు.  రాష్ట్రంలో ఎల్లోమీడియా ద్వారా వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై చంద్రబాబు నిత్యం కుట్రలు చేస్తున్నాడని  మండిపడ్డారు. తన అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిల కీర్తిప్రతిష్టలు సంపాధించుకుంటున్న సీఎం శ్రీ వైయస్ జగన్ గారిని చూసి ఓర్వలేక చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తాజాగా తాను అమరావతిలో మాట్లాడిన మాటలను సైతం వందశాతం వక్రీకరించి ఎబిఎన్, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలను ప్రసారం చేశారని అన్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియాకు బంట్రోతుగా పనిచేస్తున్న ఎంపి రఘురామకృష్ణంరాజు ఆ తప్పుడు కథనాలకు వత్తాసు పలుకుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

   ఈ రాష్ట్రంలో ఎల్లోమీడియా, ఎల్లో పత్రికలు తమ తప్పుడు కథనాలతో దివాలాకోరుతనం ను ప్రదర్శిస్తున్నాయి. మాటల్లో చెప్పలేనంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు 80శాతంక పైగా పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సిపి విజయం సాధించింది. మరోవైపు మున్సిపోల్స్‌లో 90 శాతం విజయాలను సాధించబోతున్నాం. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు జరిగితే 90 శాతంకు పైగా మేమే విజయం సాధిస్తామనే నమ్మకం వుంది. ఇవ్వన్నీ చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడు. అందుకే తనకు అనుకూలమైన ఎల్లోమీడియా ద్వారా ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాడు. 

   టీ కప్పులో తుపాను సృష్టించాలని, ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ఇబ్బంది పెట్టాలన్నదే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల ఆలోచన. చంద్రబాబుకు ప్రజల మీద నమ్మకం లేదు. నయవంచన, నమ్మకద్రోహం, నమ్మినవారిని వెన్నుపోటు పొడవడం ద్వారా అధికారంలోకి రావడమే చంద్రబాబుకు తెలుసు. ఆయన చెప్పినట్లు తప్పుడు రాతలు రాయడమే ఆంధ్రజ్యోతి, ఎబిఎన్‌ల పని. 

    అమరావతిలో నేను మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరించి ఎబిఎన్‌లో కథనం ప్రసారం చేశారు. మా సీఎం శ్రీ వైయస్ జగన్ గారు విలువలకు కట్టుబడిన వ్యక్తి, చంద్రబాబులాగా పార్టీ ఫిరాయింపులను అనైతికంగా ప్రోత్సహించరు. ఆయనలా ఇరవై ముగ్గురిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, నలుగురికి అందులో మంత్రిపదవులు ఇచ్చే విధానాలకు పూర్తి వ్యతిరేకం. తొలి సిఎల్పీ సమావేశంలో శ్రీ వైయస్ జగన్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం నుంచి మరో ఆరేడుగురిని పార్టీలో చేర్చుకుంటే టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా వుండదంటూ కొందరు సలహా ఇచ్చారని, కానీ వాటిని ప్రోత్సహించను అంటూ తన వైఖరిని స్పష్టం చేశారని గుర్తు చేశారు. దానిని ఉదహరిస్తూ నేను మాట్లాడిన మాటలను ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది. వేమూరి రాధాకృష్ణచౌదరి దిజగారుడుతనంకు అది నిదర్శనం.

   వార్డు సభ్యుడుగా కూడా గెలవలేని రఘురామకృష్ణంరాజు వైయస్‌ఆర్‌సిపి గుర్తుపై ఎంపీగా గెలిచారు. గెలిచిన ఏడాది నుంచే ఎలా ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలా అనేవిధంగా ఆయన వ్యవహరించడం మొదలు పెట్టాడు. చంద్రబాబు రాసిస్తున్న స్ర్కిప్ట్‌ను ఎల్లో మీడియాలో చదువుతూ వారికి బంట్రోతుగా మారాడు. కొమ్ములు లేని దున్నపోతులా రఘురామకృష్ణంరాజు తయారయ్యాడు. వేల కోట్లు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి, కేసులు ఎదుర్కొంటున్న ఆయన రాజకీయాల్లో శిఖండిలా మారాడు. ప్రజాభిమానంతో ముందుకు పోతున్న సీఎం శ్రీ వైయస్ జగన్‌ గారిని గురించి మాట్లాడే అర్హత రఘురామకృష్ణంరాజుకు లేదు. 

  ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ మా పార్టీలో బ్లాక్ షీప్స్‌ వున్నాయంటూ ఉపదేశాలు ఇస్తున్నాడు. పార్టీ గుర్తుతో గెలిచి, అదే పార్టీ అధికారంలో వున్న ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసే ఆయనకు సిగ్గూ,శరం వుంటే తక్షణం తన ఎంపి పదవికి రాజీనామా చేయాలి. నీకు ఏదైనా విధానపరమైన అభిప్రాయాలు వుంటే... లెజిస్లేటీవ్ పార్టీ సమావేశంకు హాజరై అందులో మాట్లాడాలి. చంద్రబాబు నీకు గురువు, నువ్వు శిష్యుడివి, మీ ఇద్దరికి వేమూరి రాధాకృష్ణ సలహాదారు.

       చంద్రబాబు రెండెకరాలతో నేడు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాధించాడో ప్రజలకు తెలుసు. ఆయనను ఆదర్శంగా తీసుకుని వేమూరి రాధాకృష్ణ కూడా అనైతికంగా ఒక చానెల్‌కు, పత్రికకు అధిపతి అయ్యాడు. కర్నూలులో చంద్రబాబు ఏం మాట్లాడారు... నేను ఎయిర్‌పోర్ట్‌లో పదిగంటలు వుంటే మీరంతా ఏం చేస్తున్నారని ప్రజలను ప్రశ్నిస్తావా...? అంటే ప్రజలు రెచ్చిపోయి నీకోసం విద్వంసం సృష్టించాలని కోరుకుంటున్నావా? శ్రీ వైయస్ జగన్ గారిని విశాఖ రన్‌వే మీద కూర్చోబెట్టావు. అటునుంచే వెనక్కి పంపించావు. మేం అలా చేయలేదే. గౌరవంగా ఎసి లాబీలో కూర్చోబెట్టాము, కాఫీ, ఆహారం అందించాము. అందువల్లే పదిగంటలు సుఖంగా ఎయిర్‌పోర్ట్‌లో వున్నావు. నిన్ను కూడా రన్‌వే మీదే కూర్చోబెడితే గంటలోనే ఆసుపత్రికి పోవాలంటే వెళ్లిపోయేవాడివి కావా? 

     జామాతా దశమగ్రహం అని ఎన్టీరామారావు గారే చంద్రబాబు గురించి చెప్పాడు. అయినా సిగ్గులేకుండా ఆయన ఫోటోలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచుకోవాలి. కానీ చంద్రబాబు వ్యవహారం అంతా చీకటి ఒప్పందాలు, వెన్నుపోటు రాజకీయాలు. నేరుగా ప్రజల్లోకి రాలేక ఎవరితోనో మా ప్రభుత్వాన్ని తిట్టించడం చేస్తున్నాడు. ఆరువందల హామీలు, నూరు పేజీల మేనిఫేస్టోతో అందరినీ మోసం చేశావు. బాబు వస్తే జాబు వస్తుందని అన్నావు. ఉన్న కాంట్రాక్ట్ జాబులు తీసేసావు. మా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. ఇదీ విశ్వసనీయత అంటే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధి బృందాలు ఎపిలో పాలనను, సీఎంగా వైయస్ జగన్ గారి సమర్థతను మెచ్చకుంటున్నారు. ఇకనైనా చంద్రబాబు తన కుట్ర, కుతంత్రాలతో చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలి.

తాజా ఫోటోలు

Back to Top