చిన్నారిపై లైంగిక వేధింపులను లోకేష్‌ సమర్థిస్తున్నారా..?

చంద్రబాబు, లోకేష్‌ల వ్యవహారశైలి రాష్ట్రానికి శాపం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ల వ్యవహారశైలి రాష్ట్రానికి శాపంగా మారిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలు, విషప్రచారాలతో ఎదిగిన చంద్రబాబు.. ఆయన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నాడన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారిపై జరిగిన లైంగిక వేధింపులను లోకేష్‌ సమర్థిస్తున్నారా..? అని ప్రశ్నించారు. చిన్నారిపై లైంగిక దాడి కేసులో హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారన్నారు. ఓ పత్రికా విలేకరి వ్యవహారం నడపాలని చూస్తే.. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగారన్నారు. పోలీసులు వెంటనే స్పందించి, దాడి చేసినవారిపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని తనపై రుద్దడం అవివేకమని, ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి కానీ, విష రాజకీయాలు కాదని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top