చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబు

టీడీపీ ఉనికి కాపాడుకునేందుకే కొత్త డ్రామాలు

కృష్ణా, గోదావరి వరదలపై రాజకీయాలు చేశారు

దాంట్లో ఫెయిలయ్యారని, మరో కుట్రకు తెరలేపారు

మంచిని చెడుగా మార్చగల జిత్తులమారి చంద్రబాబు

ఇప్పటికైనా బాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి

పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి హెచ్చరిక

గుంటూరు: తెలుగుదేశం పార్టీ మనుగడను కాపాడుకునేందుకు చంద్రబాబు చిల్లర రాజకీయాలకు తెరలేపాడని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. వరద రాజకీయాల్లో ఫెయిలయ్యామని గ్రహించిన చంద్రబాబు పల్నాడు వేదికగా మరో డ్రామాకు తెరలేపాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. గుంటూరులోని హోటల్‌ తాజ్‌ ఓల్డ్‌ విజయ కృష్ణలో మంత్రి మోపిదేవి వెంకట రమణ,  ఎంపీలు లావు కృష్ణ దేవరాయలు, నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, మేరుగు నాగార్జున, ముస్తఫా, పార్టీ ముఖ్య నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే...

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం ఇచ్చారో.. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఎంతో పారదర్శకంగా నియామక ప్రక్రియ ప్రారంభించారు. వరుణుడు కరుణించడం వలన కృష్ణా, గోదావరి నదులు జలకళతో ఉన్నాయి. రైతులు వారి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలాంటి ప్రశాంత వాతావరణం ఉంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు టీడీపీ మనుగడను కాపాడుకునేందుకు రకరకాల చిల్లర రాజకీయాలకు తెరలేపాడు.
 
కృష్ణా నది, గోదావరి నదికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడా సహాయ చర్యల పర్యవేక్షణ జరగలేదని చంద్రబాబు వరద రాజకీయాలకు తెరలేపారు. వరద రాజకీయాల్లో ఫెయిల్‌ అయ్యామని చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నేతలను హింసిస్తున్నారని మరో కుట్రను తెరమీదకు తీసుకువచ్చారు. 

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండే ప్రధానమైన అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే విషయంలో ఎక్కడా వివక్షకు తావు లేకుండా అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. అదే విధంగా అవినీతి రహిత పాలన అందించాలని, రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

అసందర్భమైన ప్రేలాపనలు, సంబంధం లేని స్టేట్‌మెంట్లతో చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రయాణం చేస్తున్నారు. గత ఐదేళ్లు అవినీతిమయమైన పాలన అందించిన ఘనత చంద్రబాబుది. హత్యా రాజకీయాలకు తెరలేపిన పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వానిది. తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాదని వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరులను, సామాన్య ప్రజలను గ్రామాల నుంచి గత ప్రభుత్వం వెలివేసింది. టీడీపీ కక్ష రాజకీయాలు భరించలేక గ్రామాలు ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. యరపతినేని అక్రమ మైనింగ్‌ను కోర్టు ప్రశ్నిస్తే అది ప్రభుత్వానిదా బాధ్యత, కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి బాగోతాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రొటెక్ట్‌ చేసుకోవడానికి పునరావాస కేంద్రాలని చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. 

ఎలాంటి సందర్భాలైనా మంచిని చెడుగా, చెడును మంచిగా మార్చుకునే రాజకీయ జిత్తులమారి చంద్రబాబు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చిన్న అవినీతి జరిగిన సందర్భాలు లేవు. హత్యా రాజకీయాలకు తావు లేకుండా పరిపాలన చేస్తున్నాము. దీన్ని భరించలేక వక్రభాషలో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు. చంద్రబాబు ఆడే డ్రామాలను ఇప్పటికైనా కట్టిపెట్టాలని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. 
 

Back to Top