ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటోంది

ఆక్వా రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చారు

ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్థాన్‌లో బందీలుగా ఉంటే విడిపించాం

మంత్రి మోపిదేవి వెంకటరమణ

ఏపీ స్టేట్‌ ఆక్వా అథారిటీ బిల్లుకు సభ ఆమోదం

అమరావతి: ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం సభలో ఆక్వా అథారిటీ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రరాష్ట్రంలో 976 కిలోమీటర్ల సువిశాలమైన తీరప్రాంతం ఉంది. ఆక్వా రంగానికి , మెరైన్‌ సెక్టార్‌కు ఎంతో సహజ వనరులు ఉన్న రాష్ట్రం మనది. ఆక్వా రంగంలో దేశంలోనే మనమే మొదటి స్థానంలో  ఉన్నాం. వేల కోట్ల పెట్టుబడులతో సుమారు 18 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. సుమారు 8 లక్షల ఎకరాల్లో ఆక్వా రంగం ఉంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న రంగం కోవిడ్‌ కారణంగా ఆక్వా ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాకుండా ఎగుమతులు ఆగిపోయాయి. రైతులు తాము పండించిన పంటలు అమ్ముకునే అవకాశం లేక భయాందోళనకు గురయ్యారు.  ఇలాంటి సమయంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ చూపారు. ఓ సమావేశం ఏర్పాటు చేసి ఆక్వా ఉత్పత్తులను ఆదుకునేందుకు, రైతుల వద్ద నుంచి 80 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక అథారిటీని తీసుకువచ్చారు. ఈ రంగంలో ఎలాంటి ప్రోడక్ట్‌ వచ్చినా క్వాలిటీ ఇవ్వాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో కూడా సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఆక్వా రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చిన్పపుడు కరెంటు యూనిట్‌ ధరను రూ.1.50లకే ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని అమలు చేశారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆక్వా సాగులో సీడ్‌ నాణ్యతపై పర్యవేక్షణ కొరవడింది. విదేశీ ఎగుమతులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని గుర్తించాం. రొయ్యల సాగుపై సరైన నియంత్రణ కొరవడటంతో ప్రత్యేక పరిస్థితిలో రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓ అధారిటీ ఏర్పాటు చేశాం. సీఎం వైయస్‌ జగన్‌ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్కెట్లు తెరిపించి ఎగుమతులు ప్రోత్సహించారు. మార్కెట్‌ విధి విధాలపై సీఎం రోజు సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకున్నారు. నాణ్యమైన సీడ్‌ రైతులకు అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల ఆక్వా టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ రంగానికి ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. సుమారు రూ.740 కోట్లు పవర్‌ సబ్సిడీ ఇచ్చాం. కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేశాం. రూ.35 కోట్లతో ఓ ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోస్టా తీరంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో వలస కూలీలకు కోవిడ్‌ సమయంలో వారిని స్వగ్రామాలకు తీసుకువచ్చాం. జనవరిలో గుజరాత్‌కు వలస వెళ్లి పాకిస్థాన్‌ కోస్టు కారిడార్‌లో అరెస్టు చేసిన సమయంలో సీఎం వైయస్‌ జగన్‌ వారిని విడుదల చేయించి సొంత గ్రామాలకు రప్పించారు. వలసలు వెళ్లకుండా ఉండేందుకు సొంత ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తామని సీఎం మత్స్యకారులకు హామీ ఇచ్చారు. జెట్టీ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. 8 జిల్లాల్లో మేజర్‌ పిషింగ్‌ హార్బర్స్, 4 మైనర్‌ హార్బర్స్‌ ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకన్నారు. మెరైన్‌ ఎగుమతుల గురించి కూడా సీఎం ఆలోచన చేశారు. రూ.97 కోట్లు మొదట మత్స్యకారులకు ప్రోత్సహకం ఇచ్చారు. రెండోసారి కూడా మత్స్యకారులకు వేట విరామ సమయంలో డబ్బులు జమ చేశాం. చనిపోయిన మత్స్యకారులకు పరిహారం అందించాం. సుమారు రూ.80 కోట్లు ఆయిల్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఈ ప్రభుత్వమే ఇచ్చింది. ఆక్వా అధారిటీని తీసుకురావడం, గిట్టుబాటు ధర కల్పించడం, క్వాలిటీ సీడ్‌ అందించడం గొప్ప విషయం. ఈ చట్టాన్ని సెఎం అధ్యక్షతనే ఈ చట్టాన్ని అమలు జరపాలని సమగ్రంగా చట్టం చేయడం, ఆక్వా రంగానికి చెందిన ఐదుగురిని భాగస్వామ్యం చేయడం శుభపరిణామం. ఈ బిల్లును అందరూ ఆమోదించాలని మంత్రి మోపిదేవి కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top