అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభదినం

పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ
 

గుంటూరు: ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ ద్వారా దగాపడి మోసపోయిన వారందరికీ ఈ రోజు శుభదినం అని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత  అగ్రిగోల్డ్‌ సంస్థలో పొదుపుదారులుగా ఉన్న వారందరికీ కష్టాలు మొదలయ్యాయన్నారు. దశా, దిశ లేకుండా రోడ్డు మీద పడిన అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ వైయస్‌ జగన్‌ నేనున్నానంటూ భరోసా ఇచ్చారన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం హామీలు ఇచ్చారో.. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతున్నారన్నారు. మనకు ఏ ఇబ్బంది ఉన్నా.. ఆదుకోవడానికి జగనన్న నాయకత్వం అండగా ఉందని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. క్రమశిక్షణ కలిగిన పరిపాలన దక్షుడిగా దేశంలోని ఉన్న ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులను కూడా ఆశ్చర్యపరుస్తూ తనదైన శైలిలో సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. నాలుగున్నర మాసాల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడమే కాకుండా.. మున్ముందు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని ప్రజలంతా అండగా ఉంటారన్నారు. 

   

Read Also: మహానేతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాజా ఫోటోలు

Back to Top