పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు

తాడేపల్లి: వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు గురువారం ఘ‌నంగా నిర్వ‌హించారు. జాతిపిత గాంధీజీ, లాల్ బ‌హ‌దూర్‌శాస్త్రి చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. వారి సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. కార్య‌క్రమంలో పార్టీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌, త‌దితరులు పాల్గొన్నారు.

Back to Top