తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. రాయలసీమలో అధికార పార్టీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోయింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మం, సుధాకర్ రెడ్డి, గుర్రప్ప, శ్రీను , తదితరులపై మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అనుచరులు కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మహిళలపై కూడా రౌడీషీటర్ టిడిపి నాయకుడు అర్జున్ ,టీడీపీ అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కోవెలకుంట్ల ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల వైయస్ఆర్‌సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి పై దాడి మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతో టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా.... రామగిరి మండలం, గరిమేకులపల్లి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కి చెందిన కురుబ శివన్నపై టీడీపీ నాయకుడు రమేష్ దాడి చేశాడు. గొర్రెలు కళ్లంలోకి వచ్చాయనే నెపంతో కర్రతో తలపై కొట్టడంతో తీవ్రరక్తస్త్రావం అయ్యింది.