తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పెళ్లికి వెళ్ల‌కుండా అడ్డుక‌ట్ట  

అనంతపురం: వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ‌ తాడిపత్రిలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని ఆపారు. ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వివాహానికి వెళ్తానని మందుగానే పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  

Back to Top