తాడేపల్లి: విజయదశమి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వివిధ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సందేశం పంపించారు. `చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.