పండగ తర్వాత అన్నీ చెబుతా

పైడిత‌ల్లిని ద‌ర్శించుకున్న మాజీ మంత్రి బొత్స 

విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ పైడితల్లిని ద‌ర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైడితల్లి అమ్మవారి పండగలో రాజకీయాలు, దుర్మార్గాలు గురించి మాట్లాడకూడదు. పండగ నిర్వహణ ఏర్పాట్లలో లోటుపాట్లు గురించి ఇప్పుడు మాట్లాడలేను. పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో పండగ తర్వాత అన్నీ చెబుతా అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మవారి చల్లని ఆశీసులు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను అని బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.

Back to Top