తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. “స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీగారు. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ``జై జవాన్..జై కిసాన్`` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.