వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌గా మిథున్‌రెడ్డి పునర్నియామకం 

తాడేప‌ల్లి:  ఉమ్మడి అనంతపురం, నెల్లూ­రు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో–­ఆర్డినేటర్‌గా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి నియమించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్‌ నాయ­కులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు.  ఇప్పుడు మిథున్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

Back to Top