అసెంబ్లీ: శాసనసభను అగౌరవపరిచే విధంగా ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తిస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి అధికార పార్టీ సభ్యులను, సభా నాయకుడిని ఏకవచనంతో మాట్లాడుతున్నారన్నారు. సభలో దళిత సభ్యులను కించపరిచే విధంగా టీడీపీ ప్రవర్తిస్తుందన్నారు. తనను ఉద్దేశించి దళితుడివా అని ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
`దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారు. సభా మర్యాదలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా పైకితీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అభూత కల్పనలతో సభను, సభ్యులను అగౌరవపర్చాలనే ఆలోచనతో ప్రతిపక్షం ప్రవర్తించవద్దు. నేను ఏదో తప్పు చేశానని ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫిర్యాదులో పసలేదు. నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదు. నన్ను, నా కులాన్ని కించపçరుస్తూ ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..’ అని మాట్లాడిన చంద్రబాబు పార్టీ వారికి సిగ్గులేదని మాట్లాడితే తప్పు ఏముంది. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి శాసనసభలో తప్పుగా మాట్లాడను.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నా`నని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.