సీఎం స‌ర్‌..మీ ఆలోచనలకు ధన్యవాదాలు

సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున 
 

తాడేప‌ల్లి: సామాజిక విప్లవం కోసం బాల్య వివాహాలు జరగకుండా చదువుకు ప్రోత్సాహం ఇవ్వాలని 10 వ తరగతి చదవాలనే ఆలోచన గొప్ప కార్యక్రమం, మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం పేదల కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది, మీ ఆలోచనలకు ధన్యవాదాలు అంటూ మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు,  షాదీ తోఫా జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో సీఎం వైయ‌స్‌ జగన్ జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు.

అందరికీ నమస్కారం, ఈ రోజు పేదల స్ధితిగతులు మార్చడానికి సీఎంగారు అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. దానిలో భాగంగా చదువులకు ప్రాధాన్యత, సమాజంలో ఉన్న పేదకులాలను ఆదుకోవడం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కళ్యాణమస్తు తీసేశారంటున్నారు కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు 17 వేలకు పైగా లబ్ధిదారులకు సుమారు రూ. 70 కోట్లు ఎగ్గొట్టిన పరిస్ధితి, మీరు మాత్రం సామాజిక విప్లవం కోసం బాల్య వివాహాలు జరగకుండా చదువుకు ప్రోత్సాహం ఇవ్వాలని 10 వ తరగతి చదవాలనే ఆలోచన గొప్ప కార్యక్రమం, మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం పేదల కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది, మీ ఆలోచనలకు ధన్యవాదాలు, టీడీపీ వారు ఎన్నికల మందు పెట్టారు, కానీ మీరు అలా కాకుండా పేద కుటుంబాలకు వివాహం భారం కాకుండా ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, వారందరి తరపునా సీఎంగారికి ధన్యవాదాలు. 

ఉమాదేవి, లబ్ధిదారు, ఏలూరు

జగనన్నా నమస్కారం, మాది నిరుపేద కుటుంబం, మేం ముగ్గురం అక్కాచెల్లెళ్ళం, నేను మీరు ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారానే డిగ్రీ పూర్తిచేశాను, ధ్యాంక్యూ అన్నా, నా చెల్లి ఇంటర్‌ చదువుతుంది, అమ్మ ఒడి అందుతుంది, మాకు చాలా పథకాలు అందాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు కళ్యాణమస్తు పథకం క్రింద రూ. 50 వేలు అందాయి, ఈ డబ్బును నేను సద్వినియోగం చేసుకుంటాను, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కానీ మీరు అడగకుండానే ఇన్ని వరాలు కురిపిస్తున్నారు. మా నాన్న గారికి చేతికి ఆపరేషన్‌ చేయాలన్నారు అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్నారు, మీ మేలు మరిచిపోలేను, మీరే రావాలి, మా నమ్మకం మీరే, మా భవిష్యత్‌ మీరే, ధ్యాంక్యూ అన్నా. 

షేక్‌ పర్వీన్, లబ్ధిదారు, కర్నూలు (ఈమె కుమార్తెకు వివాహం అయింది)

సీఎం గారికి నమస్కారం, నేను మా కుమార్తెకు వివాహం చేయడం ఎలాగా అని చాలా ఆలోచించాం, గతంలో రూ. 50 వేలు ఇచ్చేవారు కానీ మీరు ఇప్పుడు వైఎస్సార్‌ షాదీతోఫా కింద రూ. 1 లక్ష ఇస్తున్నారు. చాలా సంతోషం, మాకు మీ పథకాలు అందుతున్నాయి, మా పిల్లలు గవర్నమెంట్‌ స్కూల్‌లో చదువుతున్నారు, అమ్మ ఒడి వస్తుంది, మంచి భోజనం ఇస్తున్నారు, పుస్తకాలు, బ్యాగు, స్కూల్‌ కిట్‌ అన్నీ ఇచ్చారు, ఒకటో తారీఖు ఉదయమే వలంటీర్‌ వచ్చి మా ఇంట్లో ఫించన్‌ కూడా ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నాం, మీరు మళ్ళీ సీఎం కావాలని అల్లాని ప్రార్ధిస్తున్నాం

షేక్‌ సబిహా, కర్నూలు, (షేక్‌ పర్వీన్‌ కుమార్తె)

నమస్కారం సార్, మాకు షాదీ తోఫా పథకంలో రూ. 1 లక్ష అందాయి, మా లాంటి పేద మైనార్టీలకు ఇది చాలా ఉపయోగకరం, మీరు ఇస్తున్న విద్యాదీవెన, విద్యాకానుక, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వల్ల అనేకమంది పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుతున్నారు. మీ పథకాలు చాలా బాగున్నాయి, నవరత్నాల ద్వారా మేం లబ్ధిపొందాం, మేం చాలా సంతోషంగా ఉన్నాం, మీరు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం.

కల్పన, లబ్ధిదారు, బాపట్ల

జగనన్నా నమస్తే, నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త చనిపోయారు, నా పిల్లలకు అమ్మ ఒడి అందింది, విద్యాదీవెన, వసతి దీవెన అందాయి, మీరు ఏర్పాటుచేసిన సచివాలయాల ద్వారా నాకు అన్నీ అందుతున్నాయి, పెళ్ళి చేసే స్ధోమత లేదనుకున్న సమయంలో ఈ పథకం గురించి వలంటీర్‌ చెప్పారు, రూ. 1 లక్ష అప్పు చేసి పెళ్లి చేశాను, మీరు ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళాను, మీరు ఈ రోజు రూ. 1 లక్ష వేశారు, సొంత తోడబుట్టిన అన్న కూడా వేయరు కానీ మీరు వేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీరే మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాం, నాలాంటి పేద అక్కచెల్లెమ్మలకు అన్నలా, మా పిల్లలకు మేనమామలా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Back to Top