అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ పాలన

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారు

విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మిస్తున్నారు

లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమ సాయం అందుతుంది

సీఎం వైయస్‌ జగన్‌ దళిత పక్షపాతి.. 

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున 

అసెంబ్లీ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అర్హతే ప్రమాణికంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. దళితులకు సిఫార్సులు లేకుండా పారదర్శకత విధానంలో పూరిగుడిసెలో ఉన్న ఎస్సీలకు కూడా నేను ఉన్నాను అని సీఎం వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారన్నారు. ప్రతి సంక్షేమం పథకం లబ్ధిదారుల గుమ్మం ముందుకే వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఆనాడు అంబేడ్కర్‌ కోరుకున్న ఆలోచనలు రాష్ట్రంలో నేడు అమలవుతున్నాయని చెప్పారు.

అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాల అభివృద్ధి, సంక్షేమానికి నవరత్నాలు, ఇతర పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.32,327 కోట్లతో 122.56 లక్షల మందికి, నాన్‌ డీబీటీ ద్వారా 18,967 కోట్లతో 52.4 లక్షల మందికి లబ్ధిచేకూర్చినట్టు వివరించారు. సీఎం వైయస్‌ జగన్‌లో ఉన్న గొప్ప ఆలోచన రాష్ట్రంలోని ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూపాయి సహాయం అందాలంటే సిఫార్సులు, చిన్న లోన్‌ రావాలంటే పలుకుబడి ఉన్న కుటుంబం దగ్గరకు వెళ్లి అడుక్కునే పరిస్థితి ఉండేదని, కానీ, ఇప్పుడు ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న వారందరికీ అన్నీ అందుతున్నాయన్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో అర్హత ఉంటే చాలు సంక్షేమ సాయం అందుతుంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆరోగ్యానికి, చదువులకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు. నవరత్నాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న ఏ కార్యక్రమం అయినా అర్హత ఉన్నవారందరికీ అందుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే.. పేదలకు ఇంగ్లిష్‌ చదువు ఎందుకు అని కోర్టులకు వెళ్లినవారిని చూశాం. మాకు, మా పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు కావాలి. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు నిండు చట్టసభలో అందరి సమక్షంలో అభినందనలు తెలుపుకునేందుకు తీర్మానం ప్రవేశపెడుతున్నాను. 

బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన విధానాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  అంబేడ్కర్‌ విగ్రహం పనులు ఏ విధంగా జరుగుతున్నాయని నిశితంగా గమనిస్తున్నారు. వీలైనంత త్వరగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తాం. 

తీర్మానం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలుగా ఉండి క్రైస్తవత్వాన్ని తీసుకున్న వారిని ఎస్సీలుగా పరిగణించాలని ఏపీ చట్టసభ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని తీర్మానం ప్రవేశపెడుతున్నాం. షెడ్యూల్డ్‌ కులాలవారు క్రైస్తవ మతంలోకి చేరిన తరువాత కూడా అంటరానితనం, ఇతర ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనంతో నిస్సాహాయతతో ఉన్నారు. అందుచేత రాజ్యాంగ ఉత్తర్వుల్లో పేర్కొనబడిన ఇతర షెడ్యూల్డ్‌ కులాల లభ్యంగా ఉన్న ప్రయోజనాలు వారు పొందగలిగేలా వీలు కల్పించేందుకు వారిని షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోకి చేర్చడం కోసం బలమైన, చట్టబద్ధమైన ప్రతిపాదన ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల సహకార ఆర్థిక కార్పొరేషన్‌చే మంజూరు చేసిన ఆర్థిక సహాయ పథకాల్లో 30–08–1977 తేదీన సాంఘిక సంక్షేమ శాఖ 341 ద్వారా క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్‌ కులాల వారికి హిందుత్వ, షెడ్యూల్డ్‌ కులాలకు లభ్యంగా ఉన్న కొన్ని శాసనేతర రాయితీలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధికి, తన సమ్మేళిత విధానం ద్వారా సంతృప్త ప్రాతిపదికన సమాజంలో అన్ని వర్గాలకు నవరత్నాల పథకాలు అమలు చేస్తోంది. క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. సిక్కుమతం, బౌద్ధమతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్‌ కులాలవారిని.. షెడ్యూల్డ్‌ కులాల వారీగా పరిగణించేందుకు అర్హులుగా చేయడానికి రాజ్యాంగ సవరణ కోసం భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు అందాయి. 

హిందూమతానికి చెందిన షెడ్యూల్డ్‌ కులాలు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్‌ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, గ్రామ పొలిమేరలో ఒకే పరిధిలో సమాంతరంగా నివసిస్తున్నందున వారు ఒకే సంప్రదాయాలను, ఆచారాలను అనుసరిస్తున్నారని, సమాజంలో అవమానాలు, వివక్షతకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం వల్ల వీటిలో ఏదీ మారదని, ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని, కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని ప్రభుత్వ అభిప్రాయం. 

పైన పేర్కొన్న పరిశీలన ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హిందూ మతానికి చెందిన షెడ్యూల్డ్‌ కులాలు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్‌ కులాలు సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, గ్రామ పొలిమేరలో ఒకే పరిధిలో సమాంతరంగా నివసిస్తున్నందున వారు ఒకే సంప్రదాయాన్ని, ఆచారాలను అనుసరిస్తున్నారని, సమాజంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి లేదా మరొక మతంతో మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని, అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించాలో ఆ వ్యక్తి ఎంపిక అని, అది కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదు. ఇతర షెడ్యూల్డ్‌ కులాల మాదిరిగా అవే హక్కుల రక్షణ, ప్రయోజనాలను పొందగలగడానికి వీలుగా క్రైస్తవ మతంలోకి మారిన భారత దేశంలోని షెడ్యూల్డ్‌ కులాల వర్గ సభ్యులకు షెడ్యూల్డ్‌ కులాల హోదాను కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 
 

తాజా వీడియోలు

Back to Top