`తల్లికి వందనం`పై ప్ర‌భుత్వం పచ్చి దగా

శాసనమండలి సాక్షిగా బట్టబయలైన మంత్రి లోకేష్ నిర్వాకం

అమ‌రావ‌తి:  త‌ల్లికి వ‌ద‌నం ప‌థ‌కం ప‌చ్చి ద‌గా అని శాస‌న మండ‌లి సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లైంది. 80 లక్షల పిల్లలు, వారి తల్లులకు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. 2024-25 విద్యాసంవత్సం తల్లికి వందనంపై కూట‌మి స‌ర్కార్ తప్పుడు సమాధానం చెప్పింది. ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, వరుదు కళ్యాణి, కవురు శ్రీనివాస్ ప్ర‌శ్న వేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్ప‌కుండా దాట‌వేశారు. ఈ ఏడాది తల్లికి వందనం కోసం అడిగితే వచ్చే ఏడాది నిధులు లెక్కలు చెప్పారు.  బ‌డ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ. 9400 కోట్లు కేటాయించామంటూ లోకేష్ వచ్చే ఆర్థిక సంవత్సరం లెక్క చెప్పారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం చెప్ప‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది తల్లికి వందనం ప‌థ‌కానికి ఈ ప్ర‌భుత్వం ఎగనామం పెట్టింద‌ని విప‌క్ష స‌భ్యులు ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికల్లో ఈ ఏడాది నుంచే తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ హామీ ఇచ్చార‌ని వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు గుర్తు చేశారు.

Back to Top