ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం: తిత్లీ తుపాన్‌తో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఉద్దానం పునర్‌ నిర్మాణం సదస్సులో మంత్రి కృష్ణదాస్‌ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్దానం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 

Back to Top