సీఎం త‌ల‌పెట్టిన ప్ర‌తి కార్య‌క్ర‌మం వెనుక భ‌గ‌వంతుని ఆశీస్సులు

మంత్రి కొట్టు సత్యనారాయణ 
 

పశ్చిమ గోదావరి జిల్లా: ముఖ్యమంత్రి దైవభక్తి పరాయనుడని, ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. భగవంతుడు 2014 నుంచి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడని, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారన్నారు. భీమవరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావుడి పడిపోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే పవన్ కళ్యాణ్ ధర్మం పక్షం వహించాలన్నారు. వారాహి అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి అసత్యాలు పలుకుతూ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబును ఆశ్రయించిన అతని విధానాన్ని తప్పుపడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసేలాగా మాట్లాడే ప్రతి మాటని ఖండిస్తున్నామని కొట్టు సత్యానారాయణ తెలిపారు. నువ్వు స్థాపించిన పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. 

Back to Top