తాడేపల్లి: దొంగ సర్టిఫికెట్‌తో వేరేవారికి రావాల్సిన ప్రమోషన్‌ను దొంగిలించిన అశోక్‌బాబును అరెస్టు చేస్తే.. తప్పుచేసిన వ్యక్తిని వెనకేస్తుకొస్తూ దొంగలముఠా నాయకుడిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. నీతిమంతుడు, నిజాయితీ పరుడు అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం తప్పు అని సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ పొంది.. ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి విశ్వాసపాత్రుడిలా.. తద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్‌బాబు ఏం తప్పుచేశాడని సిగ్గులేకుండా అడుగుతున్నాడని «ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకోవడం తప్పుకాదా..? ఇంటర్ చదివి డిగ్రీ దొంగ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది వేరే వారికి రావాల్సిన అవకాశాలు అశోక్‌బాబు అనుభవించడం తప్పుకాదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. అశోక్‌బాబు మీద నమోదైన కేసు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టలేదని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఇంటర్ అని రాసి, డిగ్రీ దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు పొందాడు.. దీనిపై విచారణ చేయమని లెటర్ పెట్టింది మా పార్టీ కాదన్నారు. ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్తకు ఇస్తే.. వారు కూడా ప్రాథమికంగా విచారణ చేసి కేసును సీఐడీకి అప్పగించారని మంద్రి కొడాలి నాని తెలిపారు. సీఐడీ విచారణ జరిపి దొంగ సర్టిఫికెట్లు పెట్టాడని నిర్దారణకు వచ్చి రాత్రి అరెస్టు చేశారన్నారు. అశోక్‌బాబు నీతిమంతుడు, నిజాయితీ పరుడు, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగ నడుస్తుంది, టీడీపీలో గట్టిగా మాట్లాడే వారిని అరెస్టు చేస్తారా అని దొంగలను వెనకేస్తుకొస్తున్న ముఠా నాయకుడిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఆ పార్టీలోని అవినీతిపరులను రక్షించడం కోసం ఎలా పరితపిస్తున్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. 23 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పి పక్కనకూర్చోబెట్టినా కూడా ఇంకా సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు దొంగలను వెనకేసుకొస్తూ.. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అశోక్‌బాబు నూటికి నూరు శాతం తప్పుచేశాడడని, చట్టం చేతుల్లో అశోక్‌బాబు, చంద్రబాబు, ఇంకేబాబైనా ఒకటేనన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం ఎవరినైనా అరెస్టు చేయిస్తారు.. శిక్షించి తీరుతారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, 10 మందికి ఉద్యోగాలు, రైతు భరోసా కేంద్రాలు, డివిజన్ల స్వరూపం మారుస్తాం, పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తాం అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 చేశారన్నారు. దాన్ని టీడీపీ స్వాగతిస్తుందా.. వ్యతిరేకిస్తుందా చెప్పకుండా.. కోడిగుడ్డు మీద చంద్రబాబు ఈకలు పీకుతున్నాడని దుయ్యబట్టారు. పరిపాలనకు అనువుగా ఉంటుందని, పార్లమెంట్ మధ్యలో ఉందని పుట్టపర్తిని హిందుపూర్ జిల్లా కేంద్రం చేస్తే.. దాన్ని కూడా అక్కడి ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నాడని, రాజధాని అమరావతి రాష్ట్రం మధ్యలో ఉందని పెట్టారట.. హిందూపూర్ జిల్లా కేంద్రం మాత్రం కర్ణాటక బార్డర్‌లో పెట్టమంటారా..? పుట్టపర్తి మధ్యలో ఉంది కదా అంటే నీళ్లు నములుతారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రి కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే.. విజయవాడ పార్లమెంట్ జిల్లాకు ఎన్టీఆర్ పేరు తీసేసి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని, ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో బతుకుతున్న నాయకులు ఆయన పేరు తీసేయమని దీక్ష చేస్తున్నారు. బహిరంగంగా, నిసిగ్గుగా దీక్ష చేస్తూ ఎన్టీఆర్ పేరు తీసేయండి అని మాట్లాడుతుంటే చేతగాని చవట దద్దమ్మలా చంద్రబాబు కూర్చున్నాడు. సుకున్న కబోదిలా చంద్రబాబు కూర్చున్నాడు. ఇలాంటి పనికిమాలిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడు. ఎన్టీఆర్‌కు ద్రోహం, వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవిని, పార్టీని కబ్జా చేసిన ద్రోహి చంద్రబాబు. ఆయన చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన్ను మళ్లీ మళ్లీ వెన్నుపోటు పొడిచి చంపుతున్న దుర్మార్గుడు చంద్రబాబు, ఆయన శిష్యులు. ఎన్టీఆర్ ద్రోహులంతా టీడీపీలోనే ఉన్నారు. పాదయాత్రగా నిమ్మకూరు వెళ్లినప్పుడు అక్కడివారంతా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టండి అని వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని వైయస్ జగన్ మాటిచ్చారు. సుప్రసిద్ధమైన కనకదుర్గమ్మ కొలువైన విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే.. ఆయన పేరు తీసేయాలని, వంగవీటి మోహనరంగా పేరుపెట్టాలని అడుగుతున్నారు. రంగా మీద ప్రేమ ఉంటే 14 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాకు ఆయన పేరు ఎందుకుపెట్టలేదు. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే గుంటూరు జిల్లాకు ఆయన పేరు ఎందుకు పెట్టలేదు. దత్తత వెళ్లిన అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదు. ఎవరైనా వద్దన్నారా.. కాదన్నారా..? ఎన్టీఆర్, వంగవీటి రంగా జన్మించింది మచిలీపట్నంలోనే. ఎన్టీఆర్, రంగా విగ్రహాలకు దండలు వేసి ఎన్టీఆర్ పేరు తీసేసి రంగా పేరు పెట్టాలని టీడీపీ దీక్ష చేస్తుంది. రంగా కుమారుడిని పార్టీలో చేర్చుకొని.. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాల్సి వస్తుందేమోనని వారి కుటుంబంపై ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. రంగా పేరు పెట్టాలని, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసే కార్యక్రమం చేస్తున్నారు. వంగవీటి రాధాకు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ దగ్గరగా ఉంటారు కదా.. వెళ్లి ముఖ్యమంత్రిని అడగమని సలహా ఇస్తున్నాడు. రాధాకి వారి తండ్రి పేరు పెట్టించుకునే పరిస్థితి ఉన్నప్పుడు కచ్చితంగా పెట్టించుకుంటాడు. నీ బోడి సలహాలు ఎవరికీ అవసరం లేదు. ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగా పేరు కావాలని అడిగే ఉద్దేశం ఉంటే.. విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్ పేరు తీసేయమని అన్నం తినేవాడు ఎవడూ అడగడు. మచిలీపట్నానికి పెట్టమని అడిగేవారు. కమ్మ, కాపు కులాలకు తగాదాలు పెట్టి.. ఎన్టీఆర్, మోహన రంగా ఇద్దరికీ వివాదాలు సృష్టించాలి. ఎవరో ఒకర్ని భుజాన వేసుకోవాలనే కుటిలమైన కార్యక్రమాలు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి స్వతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలు. 67 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లు అప్పు చేసింది. ఐదు సంవత్సరాల్లో రూ. 3.70 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు ఎలా చేశాడు..? నాలుగు రెట్లు చంద్రబాబు అప్పు చేశాడు. చంద్రబాబు చేసినట్టుగా ఈ ప్రభుత్వం నాలుగు రెట్ల అప్పు చేసి ఉంటే రూ.14.80 లక్షల కోట్లు అయ్యుండేది. రూ.6.50 లక్షల కోట్ల అప్పు చేశాడని చంద్రబాబే చెబుతున్నాడు. అంటే బాబు కంటే ఎక్కువ చేశామా.. తక్కువ చేశామా..? వైయస్ జగన్ ప్రభుత్వం అప్పు చేసి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించింది. రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ల ఆధునీకీకరణ, ఆస్పత్రుల ఆధునీకీకరణ, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించాం, రైతుల కోసం గోదాములు నిర్మిస్తున్నాం. అనేక మౌలిక సదుపాయలు క్రియేట్ చేస్తున్నాం. చంద్రబాబు గ్రాఫిక్స్ మాత్రమే రిలీజ్ చేశాడు. పోలవరం పూర్తయిందని, 2018 రాసుకో అని సొల్లు కబుర్లు చెప్పాడు. కనీసం 10 శాతం మౌలిక సదుపాయలు క్రియేట్ చేయకుండా గ్రాఫిక్స్‌తో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు. కాంట్రాక్టర్లకు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు. సీఎం వైయస్ జగన్ అప్పు చేసిన ప్రతి రూపాయిని కోవిడ్‌తో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు మధ్యలో దళారులు లేకుండా నేరుగా అందించారు. మౌలిక సదుపాయల కోసం ఖర్చు చేశారు. కాబట్టి చంద్రబాబుకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ.. కానీ చంద్రబాబుకు కాదు. మాట్లాడే ముందు దొంగల ముఠాకి నాయకుడిలా పిచ్చిపిచ్చి మాటలు, సొల్లు ఉపన్యాసాలు చంద్రబాబు కట్టిపెట్టాలి. ఖర్జూర నాయుడు పేరు ఎత్తకూడదని మాట్లాడిన మీకు.. రాజారెడ్డి పేరు ఎత్తడానికి S ఏం అర్హత ఉంది. రాజారెడ్డి రాజకీయాల్లో ఉన్నారా..? టీడీపీ నేతలు నిర్ణయాత్మక విమర్శలు చేయాలనుకుంటే చేయండి. అంతేగానీ ఉద్యోగ సంఘాల ముసుగులో, ఎవరెవరి ముసుగులో దొంగ మాటలు చెబితే చూస్తూ ఊరుకోం. అశోక్ బాబును చట్టపరంగా కోర్టులో ప్రవేశపెడతాం. గౌరవ కోర్టు నిర్ణయం ప్రకారం అశోక్‌బాబు జీవితం ఉంటుంది. చట్టం తన పనితాను చేసుకుపోతుంది.