విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు శని గ్రహం.. ఈ విషయాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆటలో అరటిపండులాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాలకృష్ణకు తెలియవని, షూటింగ్‌ల నిమిత్తం బాలకృష్ణ ఇతర దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే బాలకృష్ణ చదువుతున్నారన్నారు.