వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు

బాబుకు జోలె పట్టుకొని అడుక్కోవడం అలవాటైంది

చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు

సభలో మంత్రి కొడాలి నాని

అసెంబ్లీ: వ్యవసాయం దండగన్న  వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రైతు సమస్యలు, పథకాలపై సభలో చర్చ జరుగుతుంటే టీడీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొడాలి నాని మాట్లాడుతూ..వ్యవసాయ దండగ అన్న చంద్రబాబు సారధ్యంలో నడిచే వీళ్లు అమరావతి అంటున్నారు. వైజాగ్‌కు చెందిన వెలగపూడి దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృష్ణా జిల్లాలో పుట్టినా కూడా వైజాగ్‌ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన ఇక్కడికి వచ్చి అమరావతిలోనే సెక్రటేరియట్‌ ఉండాలని పోడియాన్ని ముట్టడిస్తున్నారు. ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపై ప్రేమ లేదు. ఒక పూట అన్నం పెట్టినా కూడా కృతజ్ఞతగా ఉంటాం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. చంద్రబాబు కంటే అధిక మెజారిటీ ఇచ్చారు. అలాంటి వ్యక్తి బుద్ధి, జ్ఞానం లేకుండా, తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు. వీళ్లను ఏం చేయాలో వైజాగ్‌ ప్రజలు నిర్ణయించుకుంటారు. రైతుల కోసం వైయస్‌ జగన్‌ రైతు భరోసా పథకం అమలు చేశారు. ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లతో గిట్టుబాటు ధరలు కల్పించారు. అనేక ప్రాజెక్టులు చేపట్టారు. గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తరలించాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. 23 సీట్లు వచ్చినా కూడా చంద్రబాబుకు సిగ్గు,శరం లేకుండా  ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు జోలె పట్టుకొని అడ్డుకోవడానికి అలవాటు పడ్డారు. ఎలాగైనా సభలో గందరగోళం సృష్టించి సభను వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త భిక్షగాడు పొద్దెరగడు అంటారు...గత 20 రోజులుగా జోలె పట్టుకుని అడుక్కొవడం అలవాటైంది. చంద్రబాబు అసెంబ్లీ మెట్ల వద్ద నల్ల గుడ్డ వేసుకొని కూర్చున్నారు. చిల్లర రాజకీయం చేస్తున్న టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వీళ్లలో మార్పు రావడం లేదు. కొన ఊపిరితో ఉన్న టీడీపీ సభలో అల్లరి చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న తీరు సరికాదని ముందుకు రావడం లేదు. మరో ఇద్దరు మాత్రమే చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటు పడి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరికి 74 ఏళ్లు వచ్చాయి..మొన్న తొడలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. సిగ్గు లేని చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్న సభ్యులు పోడియం ఎక్కకుండా మెట్ల వద్ద మార్సల్స్‌ను పెట్టి వీళ్లను అరికట్టాలని కోరుతున్నాను. 

Back to Top