పవన్‌పై పోటీకి నేను సిద్ధం

చంద్రబాబు, లోకేష్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదు

పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

విజయవాడ: లోకేష్, చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. లోకేష్‌ను ప్రజలంతా ఓ జోకర్‌లా చూస్తున్నారని, ఇక అతడి పాదయాత్ర పెద్ద జోక్‌గానే మిగిలిపోతుందన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తణుకు నుంచి పవన్‌పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ప్రజలంతా చీదరించుకున్నారు కాబట్టే 2019లో 23 సీట్లకు పరిమితం చేశారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంక్‌ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. 
 

Back to Top