తాడేపల్లి:చంద్రబాబులో ప్రేతకళ. అందుకే చావు మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. పేదల ఇళ్లను సమాధితో పోల్చిన చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు ప్రెస్‌మీట్‌లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడారంటే..: ప్రేతకళతో అన్నీ చావు మాటలే..: – చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ద్రోహి. – ఇవాళ ఎన్టీఆర్‌ను స్మరించుకోడానికి సిగ్గులేదా? ఆనాడు ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. – అందుకే చంద్రబాబుకు ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. – అప్పుడు పెద్దాయనను బయటకు గెంటేసి, ఆయనపై చెప్పులు విసిరేయించి.. ఇప్పుడు దండలేయడానికి సిగ్గులేదా? – బాబూ.. నువ్వు నయవంచకుడివి. రంగులు మార్చే ఊసరవెల్లివి. జిత్తుల మారి గుంట నక్కవు. – పేద వారికి ఇంటి స్థలం ఇస్తుంటే సెంటు భూమిలో సమాధి కట్టుకోవడానికి అంటావా? – తణుకులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన సెంటు భూమి విలువ రూ.14 లక్షలు. ఆ స్థలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటున్నారు. – చంద్రబాబులో ప్రేతకళ వచ్చింది. అందుకే అన్నీ చావు మాటలు మాట్లాడుతున్నాడు. ఫ్లెక్సీ పెట్టుకుంటే.. పెద్ద దినం అంటావా?: – నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు చూపి, ఫ్లెక్సీ పెట్టించాను. – నేను ఒక బీసీ మంత్రిని. నన్ను అవమానిస్తూ.. ఆ ఫ్లెక్సీ నా పెద్ద దినం కోసం ఏర్పాటు చేశామని అన్నావు. – బాబూ నీకు సిగ్గు.. ఎగ్గూ ఏమైనా ఉన్నాయా? అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు నీకుందా? – బీసీలను ఓట్లేసే యంత్రాల్లా వాడుకున్న నీవు, ఈరోజు వారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం. – నిజానికి బీసీలకు జగన్‌గారి హయాంలోనే పూర్తి న్యాయం జరిగింది. – ఈ నాలుగేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్ గారిది. – మూడు సార్లు సీఎంగా పని చేసిన నీవు.. కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. వారిని దారుణంగా అవమానించావు: – బీసీల తోక కత్తిరిస్తా అన్న చంద్రబాబు, నాడు వారిని దారుణంగా అవమానపర్చారు. – అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అన్న చంద్రబాబు.. అలా అన్ని వర్గాలను దుర్భాషలాడారు. – బాబూ, నీ మాటలను ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. దీన్ని గుర్తుంచుకో. నోరు తెరిస్తే అబద్ధాలు: – రైతు పోరు బాట పేరుతో మా ప్రాంతానికి వచ్చిన చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. – మా దగ్గర ఒక కౌలు రైతు చనిపోతే నేను వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించాను. – ప్రభుత్వం తరపున రూ.7 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాం. – ఆ రైతు భార్యకు వితంతు పింఛన్ ఇస్తున్నాం. కుమారుడికి గుండె ఆపరేషన్ చేయించాం. – అయినా ఆ కుటుంబాన్ని ఆదుకోలేదంటూ.. పచ్చి ఆబద్దాలు చెప్పాడు. అదే కౌలు రైతు కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రభుత్వం తమకేం చేసిందో స్పష్టంగా చెప్పాడు. – నిజానికి, తన పోరుబాటకు వచ్చిన రైతుకు రూ.2.5 లక్షలు ఇస్తానన్న చంద్రబాబు, ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదు. రైతులూ లేరు. యువతా లేదు: – చంద్రబాబు రైతు పోరుబాటలో రైతులు లేరు. లోకేశ్ పాదయాత్ర యువగళంలో యువతే లేదు. – ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేసింది. అందుకే రైతులెవ్వరూ చంద్రబాబు పోరుబాటకు హాజరు కాలేదు. – ఇదే విషయాన్ని రైతులంతా తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకుందని వారు వెల్లడించారు. – దీంతో దిక్కు తోచని టీడీపీ శ్రేణులు.. ఎక్కడెక్కడో తడిసిన ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోసి షో చేయాలని చూశారు. కానీ వారి ఆటలు సాగలేదు. బాబూ.. నీ మాటలు ప్రజలు నమ్మబోరు: – చంద్రబాబూ.. నీ పని అయిపోయింది. ఇక నీ మాటలు ప్రజలెవ్వరూ నమ్మబోరు. నీ గత 5 ఏళ్ల పాలనలో ఒక్క నిరుపేద కుటుంబానికి అయినా కనీసం సెంటు భూమి ఇచ్చావా? – ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పిస్తే లక్ష్మీపార్వతి అందుకోవాల్సి వస్తుందని అప్పటి పీఎంకు.. ఆ అవార్డు ఇవ్వొద్దని చెప్పిన నీచుడు చంద్రబాబు. – ఎన్టీఆర్‌కు బతికి ఉన్నప్పుడు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు.. ఆయన చనిపోయిన తర్వాత కూడా మళ్లీ అదే పని చేస్తున్నాడు. ప్రజలే పిచ్చి కుదురుస్తారు: – బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు చేయలేని పనులు జగన్ గారు చేస్తున్నందుకు సంతోషించు. – నువ్వు. నీ కొడుకు ఇద్దరూ సైకోలుగా మారి.. పిచ్చి పట్టినట్లు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. – బాబూ.. నీకు, నీ కుమారుడికి ప్రజల అండ లేదు. కేవలం ఎల్లో మీడియా అండతోనే రాజకీయం చేస్తున్నారు. – అందుకే ప్రజలు త్వరలోనే మీ పిచ్చి కుదురుస్తారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం: – అవినాష్‌రెడ్డి అరెస్టు.. అంటూ విపరీతమైన అబద్దపు ప్రచారం చేస్తున్నారు. – నిజానికి చంద్రబాబు అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. – స్కిల్ డెవలెప్‌మెంటులో రూ.300 కోట్లు, కేబుల్ నెట్‌వర్క్‌లో రూ.277 కోట్లు, అమరావతి స్కాంలో లక్షల కోట్లు దోచుకున్నాడు. – చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం. – అరెస్టు భయంతోనే చంద్రబాబు పిచ్చికుక్కలా తిరుగుతున్నాడని మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.