న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం

వ్య‌వ‌సాయశాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు
 

కాకినాడ : భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతు కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పార‌ని వ్య‌వ‌సాయశాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. కాకినాడ రూరల్ ఎఫ్.సి.ఐ కాలనీ,జన చైతన్య నగర్ ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం అడిగి తెలుసుకొని స‌మీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. కాకినాడ రూర‌ల్‌లో 40 కాల‌నీలు ముంపుకు గుర‌య్య‌య‌ని, దాదాపు 70 వేల మంది ముంపులో జీవిస్తున్నారు. రిజర్వాయర్ల నుండి విడుదలైన వరద నీరు, భారీ వర్షాల కారణంగా జిల్లా తీవ్రంగా దెబ్బతిందని, వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం  జ‌రిగింది. వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం అంచనాలను రూపొందించేందుకు బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మేజర్, మైనర్ డ్రైయిన్ లలో వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల ముంపు సమస్య వచ్చిందని, వరదలు తగ్గిన తరువాత డ్రైయిన్ ఆక్రమణల తొలగింపుపై క‌ఠిన  చర్యలు తీసుకుంటాం అని మంత్రి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top