అసెంబ్లీ: ప్రభుత్వ పథకాల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక, చంద్రన్న రోడ్లు, చంద్రన్న చెరువులు ఇవన్నీ చూశామని, ఇవి కాకుండా చంద్రన్న దగా, చంద్రన్న పగ రెండు పథకాలు అమలు చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరైనా వారి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నిలబడేలా చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఆరోజుల్లో ప్రభుత్వ పథకాల కోసం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్తే.. జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లాలని సూచించిన దాఖలాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఎన్టీఆర్ హౌసింగ్ అని పేర్లు పెట్టుకున్నారన్నారు. ఇవాళ పథకాల పేర్ల గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మార్క్ అని మంత్రి కన్నబాబు చెప్పారు. ఏడాదిరన్న పాలనలో ఒక్క పథకం కాపీ కొట్టామని ప్రతిపక్షం చెప్పగలదా..? రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి సీఎం స్వయంగా రూపొందించినవేనని మంత్రి కన్నబాబు చెప్పారు.