రైతు బాంధవుడు..సీఎం వైయస్‌ జగన్‌ 

రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర వైయస్‌ జగన్‌ది

కౌలు రైతులు డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

మంత్రి కన్నబాబు

కాకినాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు బాంధవుడని మంత్రి కన్నబాబు అన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని మంత్రి   పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని ఐదేళ్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..అర్హత కలిగిన వారిని వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద గుర్తించి పెట్టుబడి సాయం చేస్తామన్నారు.   డిసెంబర్‌ వరకు కౌలు రైతులకు గడువు పెంచామని, వైయస్‌ఆర్‌ భరోసా సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న రైతులందరికీ వైయస్‌ఆర్‌ రైతు భరోసా అందించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ప్రతి ఒక్క రైతుకు సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండోద్దన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌ సీడ్‌ చేయించుకోవాలని, కొన్ని చోట్ల నాన్‌ ఫెర్మామెన్స్‌ అకౌంట్లు ఉన్నాయని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేయించామన్నారు. బ్యాంకర్లు ఇందుకు సహకరించాలని కోరారు. వెబ్‌ ల్యాండ్‌లో ధ్రువీకరణ జరగలేదని రైతులు పేర్కొంటున్నారని, అలాంటివి గమనిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాలో అర్హత ఉన్న రైతులను మిస్‌ కాకుండా చూడాలని సీఎం సూచించినట్లు చెప్పారు. అన్ని పథకాల్లో సోషల్‌ ఆడిట్‌ చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.రూ.67,500 ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం అన్నది గొప్ప విషయమన్నారు.

Read Also: ఎస్సీ, ఎస్టీల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవద్దా?

తాజా ఫోటోలు

Back to Top