నెల్లూరు: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికి వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందని వివరిస్తూ.. ప్రజా సర్వే చేపడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వైయస్‌ఆర్ సీపీ చేస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన టీడీపీ సానుభూతిపరులు కూడా ఇంటికి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలను సైతం వివరిస్తున్నామన్నారు చంద్రబాబు, లోకేష్‌కు దళితులంటే చులకన అని మంత్రి కాకాణి మండిపడ్డారు.