ఢిల్లీ: రాష్ట్రంలోని సహకార వ్యవస్థ, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం వైయస్ జగన్ సూచనలు, సలహాలతో ముందుకెళ్తున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆర్బీకేలు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహించిన కోఆపరేటివ్ సదస్సులో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను సదస్సులో ప్రస్తావించారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడారు.
‘‘హోంమంత్రి అమిత్ షా కోఆపరేటివ్ వ్యవస్థపై అనేక రకాల సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో కోఆపరేషన్‌కు సంబంధించి ఒక పాలసీ ఏర్పాటు చేయాలనే ఆలోచన, రాష్ట్రాల్లో ఒక్కో సహకార చట్టాలు, వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి దేశ వ్యాప్తంగా ఒకే చట్టాన్ని, వ్యవస్థను అమలు చేస్తే బాగుంటుందని అమిత్ షా చెప్పారు. ప్రతీ పంచాయతీ పరిధిలోనూ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీని విస్తరించాలని, ప్రకృతి వ్యవసాయ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్, మార్కెటింగ్‌కు అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కొన్ని సంస్థలను గుర్తిస్తున్నామని చెప్పారు. అదే విధంగా కోఆపరేషన్ రంగాన్ని మరింతగా విస్తరించాలని ఆలోచనతో పాటు కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, రాష్ట్రంలోని కోఆపరేటివ్ బ్యాంక్‌కు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అనుసంధానం చేయాలని ఆలోచన. కోఆపరేటివ్స్‌ను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆలోచనతో సదస్సును ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టే నాటికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి రూ.295 కోట్లు ఇన్‌ఫ్యూజన్ క్యాపిటల్ అందివ్వడంతో బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయి. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ (ప్యాక్స్)లు కొన్ని నష్టాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి వీలైనంత త్వరగా లిక్విడేషన్ పూర్తి చేసి.. కొత్తగా ప్యాక్స్ ఏర్పాటు చేయడం, పునర్‌వ్యవస్థీకరించేలా దృష్టి పెట్టడం జరుగుతుంది.
రైతు భరోసా కేంద్రాల గురించి సదస్సులో కేంద్రమంత్రి అమిత్ షాకి వివరించాం. మన దేశం నుంచే కాదు.. ఇతర దేశాల ప్రతినిధుల బృందాలు కూడా వచ్చి ఆర్బీకేలను సందర్శిస్తున్నాయి. ప్రశంసిస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలబడుతున్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. సీఎం వైయస్ జగన్ హయాంలో గతం కంటే ప్రతీ సంవత్సరం అదనంగా 14 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం.
వ్యవసాయానికి సంబంధించి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోతే.. అన్నీ సీఎం వైయస్ జగన్ చెల్లించారు. చివరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా చంద్రబాబు పరిహారం చెల్లించలేదు. వాటన్నింటినీ తీర్చడంతో పాటు రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డాం. రైతాంగానికి సహకార వ్యవస్థ అవసరం, సహకార వ్యవస్థ రైతాంగానికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏపీ సహకార వ్యవస్థకు అండగా నిలవాలని కేంద్రమంత్రిని కోరాం. రాష్ట్ర పునర్విభజన తరువాత వనరులు కోల్పోయాం. ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించాలని కేంద్రమంత్రి అమిత్ షాని కోరాం. అన్నింటికీ కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు’’ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.