లోకేష్‌ యాత్రతో టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: లోకేష్‌ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రజలతో సంబంధం లేని, ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి లోకేష్‌, అలాంటి వ్యక్తి యాత్రకు ప్రజలెవరూ స్పందించరన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ పాదయాత్రను చూసి భయపడే పరిస్థితి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు, రాదని స్పష్టం చేశారు. లోకేష్‌ను యాత్ర చేయించే బదులుగా.. చంద్రబాబే పాప పరిహార యాత్ర చేపడితే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. 
 

Back to Top