చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుంది

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మేనిఫెస్టోను మేం భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తున్నాం

టీడీపీ నేతలు మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు

ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడడమా?

విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు

చంద్రబాబు పబ్లిసిటీ కోసం 8 మందిని బలి తీసుకున్నారు

నెల్లూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అన్నివర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అంతా కరువు కాటకాలేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, తల్లికి తిండి పెట్టలేని, తండ్రికి తల కొరివి పెట్టలేని చంద్రబాబు మానవ సంబంధాల గురించి మాట్లాడటం నీచంగా ఉందన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.

  • మా మేనిఫెస్టోను సీఎం వైయస్‌ జగన్‌ భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులోని అంశాలను చిత్తశుద్ధితో నెరవేర్చారని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోను ఎక్కడ దాచారో తెలియదు. వెబ్‌సైట్‌ నుంచి తొలగించి మేనిఫెస్టోను దొంగించిన దొంగ చంద్రబాబు..నీకన్నా నీచుడు, మోసగాడు, అవినీతి అక్రమార్కుడు చంద్రబాబే. చంద్రబాబు మాట్లాడేటప్పుడు సిగ్గుపడాలి. ఆయన పాదం ఎక్కడ మోపినా కరువు, కాటకాలే. దరిద్య్రపు పాదం మోపితే పచ్చని పంటలు కూడా ఎండిపోయాయి. అలాంటివ్యక్తి వ్యాసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాజ్యాంగం గురించి, అంబేద్కర్‌ గురించి చంద్రబాబు మాట్లాడటం నీచం. మా పార్టీకి చెందిన 23 మందిని కొనుగోలు చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి దుర్మార్గుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి మాట్లాటం బాధాకరం. రాజ్యాంగం పట్ల కనీస విలువ, విశ్వసనీయత ఉంటే ఒక పార్టీలో గెలిచిన వారికి మరో పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు ఇస్తావా?.
  • మామకు వెన్నుపోటు పొడిచిటీడీపీని లాక్కున్నావు. కుటుంబ సభ్యులను వాడుకొని అసెంబ్లీలో ఎగనామం పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు.
  • కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబు సిగ్గుపడాలి. బీబీసీ చానలే నీ తీరును ఎండగట్టింది. సందుల్లో, గొందుల్లో మీటింగ్‌లు పెట్టి 8 మందిని బలిగొన్నావు.  చంద్రబాబు సిగ్గు,శరం ఏమీ లేదు. ఇంత దుర్ఘటన జరిగితే విమర్శలు చేస్తూ పర్యటిస్తున్నారు. దగదర్తి విమానాశ్రయం వద్దకు వెళ్లి బోర్డును చూశావు. నీకు సిగ్గు ఉంటే నీ తలను ఆ బోర్డుకు వేసి కొట్టుకోవాలి. శిలాఫలకాన్ని చూసి తాను వచ్చి ఉంటే పారిశ్రామిక హబ్‌ చేసేవారట. ఐదేళ్లు ఉండి ఏం చేశావు. ఎన్నికలకు ముందు విమానాశ్రయం గుర్తుకు వచ్చిందా?. 2003లో దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు..అక్కడికి వెళ్లేందుకు కూడా దారి లేకపోతే హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. 2014లో చంద్రబాబు  గెలిచి ఉద్దరించింది ఏంటి? కనీసం సంగం–నెల్లూరు బ్యారేజీలకు ఏం చేశావుచంద్రబాబు. వైయస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టును నిర్మించారని, ఆయన్ను అభినందిస్తున్నానని ఎందుకు చెప్పలేకపోయావు చంద్రబాబు. రైతులకు క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. సమర్ధుడివి అయితే సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయావు. నీరు–చెట్టు పేరుతో దోచుకు తిన్నావు. వ్యవసాయం గురించి  చంద్రబాబుకు తెలిసింది ఒక్కటే..ఊర్లో పండించిన శనగకాయలు దొంగిలించడమే నీకు తెలుసు. పగలు మీ నాన్న, రాత్రి చంద్రబాబు శనగకాయలు దొంగతనం చేసింది వాస్తవం కాదా?. పనికిమాలిన వేధవ..తల్లికి తిండిపెట్టలేని వాడివి, తండ్రికి కొరివి పెట్టలేని వ్యక్తివి నీవ్వు..మానవ సంబంధాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వేల కోట్లు సంపాదించిన వ్యక్తి తల్లికి తిండిపెట్టలేకపోయావు. జన్మనిచ్చిన తండ్రికి తల కొరివి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. 
  • ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు అంటున్నాడు. నీ హాయంలోనే కదా మిల్లర్ల వద్ద ముడుపులు తినింది మీ వారే కదా?. ఆ దొంగలు టీడీపీ నాయకులే కదా? అలాంటి పార్టీకి నాయకుడైన చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు.
     
Back to Top