చంద్రబాబు అవినీతి పాపం పడింది

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

విజ‌య‌వాడ‌: అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేసిన చంద్ర‌బాబు నాయుడి పాపం పండింద‌ని, అవినీతి కేసుల్లో చంద్ర‌బాబు ఎప్పుడో అరెస్టు కావాల్సింద‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణమ‌ని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన సూత్ర‌ధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టుపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. సిమెన్స్ అనే కంపెనీతో 3000 రూపాయలు కోట్లు పెట్టుబడి అంటూ డ్రామాలు ఆడాడ‌ని, ప్ర‌భుత్వం త‌ర‌ఫు వాటాగా రూ.371 కోట్ల‌ను వెంట‌నే రిలీజ్ చేయించి ఆ డ‌బ్బును అప్ప‌నంగా మింగేశాడ‌న్నారు. హవాలా మార్గం ద్వారా తిరిగి ప్రజల డబ్బును కొట్టేసి చంద్రబాబు మొత్తం దొడ్డి దారిన తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన కుంభకోణం బయటపడి ఈరోజు అరెస్టు అయ్యాడన్నారు. ఇన్ని వందలు వేలు కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయమ‌న్నారు. 

Back to Top