ఎందుకంత కడుపు మంట? ఏమిటా విమర్శలు

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్‌

దావోస్‌ సదస్సుకు సీఎంగారు ఫ్యామిలీతో వెళ్లకూడదా?

రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ పెట్టుబడుల కోసమే సీఎం టూర్‌

స్పష్టం చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

గతంలో చంద్రబాబు ఏకంగా 38 విదేశీ పర్యటనలు

ఆయన వెంట వెళ్లిన వారంతా దోపిడిదారులే కదా?

చిన్న పిల్లాడిలా బులెట్‌ ట్రెయిన్‌ పక్కన చంద్రబాబు ఫోటో

ఆ ట్రెయిన్‌ రాష్ట్రానికి వచ్చేస్తుందంటూ అప్పుడు ప్రచారం

అలా ఆనాడు చంద్రబాబు విదే««శీ పర్యటనలు

 
వైయ‌స్‌ జగన్‌గారి పరిపాలనలో ఎవరూ చట్టానికి అతీతులు కారు

మా ఎమ్మెల్సీపై నేర ఆరోపణలు వస్తే వెంటనే కేసు నమోదు 

అలాగే అరెస్టు చేయమన్నాం. ఎవ్వర్నీ కాపాడాల్సిన అవసరం లేదు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైయస్సార్‌సీపీకి పట్టుకొమ్మలు

జగన్‌గారికి వీర విధేయులు. ఆయన బాటలోనే అందరూ

తాడేపల్లి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే టీడీపీ నేత‌ల‌కు ఎందుకంత క‌డుపు మంట‌, ఆ విమ‌ర్శ‌లు ఏంట‌ని మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ ఏడుపుగొట్టు ప్రచారం. కడుపుమంట. కనీసం మనుషులం అన్న సంగతి కూడా మర్చిపోయి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న వారి విధానం చూస్తుంటే, ప్రజలంతా 14 ఏళ్లు ఈ సీఎంనా భరించింది అని బాధ పడుతున్నారు. సీఎంగారు దోవాస్‌ సదస్సుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం తప్పా? నేరమా? దీని మీద చిలవపలువలుగా వృద్ధ జంబూకం యనమల, విజయవాడలో ఉండే పనికి మాలిన పట్టాభి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఆదివారం తాడేప‌ల్లిలోని  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు.

నల్లధనానికి కేరాఫ్‌ చంద్రబాబు:
    మీకు ఎందుకు కడుపు మంట. మీ నాయకుడు కనీసం 38 సార్లు విదేశీ పర్యటన చేశారు. ఆనాడు ఆయన ఎవరిని తీసుకెళ్లారు. అప్పటి మంత్రి యనమలతో పాటు, సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి దోచుకునే దొంగలనే కదా?. దేశంలో నల్లధనానికి సొత్తు ఎవరు అంటే, అందరూ చెప్పేది ఒకే పేరు. నారా చంద్రబాబునాయుడు అని. అంతలా దోచుకోవడం, దాచుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. అలాంటి చంద్రబాబు 38సార్లు విదేశాలకు వెళ్లారు.

ఎంత దుర్మార్గం:
    కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు రాష్ట్రానికి మంచి చేయడం కోసం దావోస్‌ సదస్సుకు కుటుంబ సభ్యులను తీసుకుపోతే.. ఏం జరిగిందని చిలువలు పలువలుగా రాస్తున్నారు. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ఎంత దుర్మార్గం?. 
    నిజంగా మీకు పాపం పండింది కాబట్టే, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి అణగదొక్కాలో అక్కడికి అణగదొక్కారు. ఇవాళ మళ్లీ రోడ్ల మీదకు వచ్చి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

సిద్ధంగా ఉండండి:
    యనమల రామకృష్ణుడు.. మీకు వయసు మీద పడింది కానీ, బుద్ధి రాలేదు. నీవు మాట్లాడే మాటలు ఏమిటి. సంకుచిత మనస్తత్వం అయిపోయింది. చంద్రబాబు ఏం మాట్లాడమంటే అది  మాట్లాడుతున్నావు. సీఎంగారు దావోస్‌కు కుటుంబ సభ్యులను తీసుకుపోతే తప్పేమిటి?
    చంద్రబాబుకేమో అల్జీమర్స్‌ రోగం. యనమల రామకృష్ణుడికేమో కడుపుఉబ్బ రోగం. పనికి మాలిన పట్టాభికేమో కడుపు మంట రోగం. అసలు మీ పరిస్థితి ఏమిటబ్బా. ప్రజలు మిమ్మల్ని మళ్లీ ఓటు అనే ఆయుధంతో కొడతారు. సిద్ధంగా ఉండండి.

బాబుది అంత పనికి మాలిన పని:
    విదేశీ పర్యటన అంటే మీ లాగ అనుకున్నారా? అంటూ.. బులెట్‌ ట్రెయిన్‌ పక్కన నిలబడ్డ చంద్రబాబు ఫోటో చూపారు. ఇలా చిన్న పిల్లలు ఫోటో దిగుతారు. అలా ఫోటో దిగి, రాష్ట్రానికి బులెట్‌ ట్రెయిన్‌ వచ్చిందని చెప్పారు. అంత పనికి మాలిన పని చంద్రబాబుది.

ప్రజలు మిమ్మల్ని సహించరు:
    ఇవాళ సీఎంగారు దావోస్‌లో ఇప్పటికే 6 ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా గొప్పగా ఎదగాలని ఆయన అక్కడ పర్యటిస్తూ,  రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతలా పని చేస్తుంటే, ఇక్కడ మీరు మాట్లాడే భాష. వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. మీ వెకిలిగొట్టు చేష్టలు. ఇవన్నీ ప్రజలు సహించరు. 
    చంద్రబాబుగారు ఊగిపోతున్నారు. ముఖ్యమంత్రిగారిని ఉద్దేశించి బూతులు మాట్లాడుతున్నారు. నీవెంత ఊగిపోయినా, చిందులు తొక్కినా ఈ రాష్ట్రంలో జనమంతా జగన్‌గారి వెంటే ఉన్నారు. దీన్ని గుర్తు పెట్టుకొండి. 
    బలహీనవర్గాల వారంతా సామాజిక న్యాయ నిర్మాత, జయహో జగన్‌ అని నినదిస్తున్నారు. నీవు చేసిన దుర్మార్గాలు ఎవరూ మర్చిపోలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్లు అధికారంలో నీవన్నీ రాజకీయాలే చేశావు. మా మీద పెత్తనం చేశావు. నీ పాపం పండింది కాబట్టి, 23 సీట్లకు పరిమితం అయ్యావు.

జగన్‌గారు–సామాజికన్యాయం:
    అదే సామాజిక నిర్మాత అయిన జగన్‌గారు 25 మంత్రి పదవుల్లో 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారు. సొంత కుటుంబ సభ్యులు తప్పు చేస్తే బహిష్కరించిన గొప్ప వ్యక్తి జగన్‌గారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఒక నేరంలో ప్రమేయం ఉందని తెలిస్తే 302 కింద కేసు నమోదు చేయించారు. అరెస్టు చేయమన్నారు. పార్టీలకు అతీతంగా చట్టం ముందు అంతా సమానమే సీఎంగారు చెబుతున్నారు.
    కాబట్టి మీరు ఎన్ని కుట్రలు పన్నినా, పన్నాగాలు పన్నినా, మీడియాలో కధనాలు రాసి, సీఎంగారిని అభాసుపాలు చేయాలని చూసినా ప్రజలు నమ్మబోరు.

ప్రజల్లో అంతులేని అభిమానం:
    మీ మాదిరిగా నల్లధనం దాచుకోవడానికి సీఎంగారు విదేశీ పర్యటనకు వెళ్లలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇక్కడికి పెట్టుబడులు రావడం కోసం, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం కోసం వెళ్లారు.
కానీ సీఎంగారి కుటుంబం మీద బురద చల్లాలి అన్న దుర్మార్గం మీది. రాక్షసులు మీరు. ఇలా నిందలు వేస్తుంటే ప్రజలు క్షమించరు. వదిలిపెట్టరు.

ఆ 23 కూడా మీకు రావు:
    గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తమను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటున్నారంటూ అందరూ సీఎంగారిపై అభిమానం చూపుతున్నారు. 
    అందుకే చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, మోకాళ్ల మీద నడిచినా, ఆయన తిరిగి అధపాతాళానికి పోబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఇప్పుడున్న 23 సీట్లు కూడా రావు.

 జగన్‌గారి పరిపాలనలో ఎవరూ చట్టానికి అతీతులు కారు. మా ఎమ్మెల్సీ ఒక కేసులో ఉంటే, వెంటనే కేసు నమోదు చేయమన్నాం. అరెస్టు చేయమన్నాం. ఎవరినీ కాపాడాల్సిన అవసరం మాకు లేదు. సీఎం గారికి అంత కంటే లేదు. 

    బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టుకొమ్మలు. జగన్‌గారికి వీర విధేయులు. ఆయన చూపుతున్న ప్రేమకు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తారు. ఆయన గురించి గతంలో తెలియని వారు కూడా, ఇప్పుడు ఆయన వెంట వస్తున్నారు. సీఎంగారు చేస్తున్న సామాజిక న్యాయం అందరినీ ఆకట్టుకుంటోంది అని మంత్రి శ్రీ జోగి రమేష్‌ వివరించారు.
 

   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top