చంద్రబాబు ముసలి నక్క.. పవన్‌ కల్యాణ్‌ పిచ్చికుక్క

పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు

పెళ్లాలను మార్చినట్టు పవన్‌ పార్టీలను మార్చారు

మంత్రి జోగి ర‌మేష్‌

వెంక‌టాయ‌పాలెం: పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి జోగి ర‌మేష్ మండిప‌డ్డారు.  పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నార‌ని తెలిపారు. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయ‌స్‌ జగన్‌. మా సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటామ‌న్నారు. వెంక‌టాయ‌పాలెంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి మాట్లాడారు.
 పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. 

సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రను తిరగ రాస్తున్నారు.. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండాలంటే చంద్రబాబు సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అన్నాడు.. కానీ, రాజధానిలో జగన్ 50 వేల మందికి ఇళ్లు కట్టిస్తున్నారు.. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్ర‌బాబు ఓ ముస‌లి న‌క్క అంటూ ఫైర్ అయ్యారు. కుక్కలకు కూడా సీజన్ ఉంటుంది.. చిత్తకార్తి సమయంలో కుక్కలు కూడా రోడ్డు మీదకు వచ్చి మొరుగుతాయి.. ఇటువంటి చిత్తకార్తి కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్డు మీదకు వస్తున్నాయి అంటూ మండిపడ్డారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు 

పవన్‌ కల్యాణ్‌ పిచ్చికుక్క, పవన్ కల్యాణ్‌ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తాడు అంటూ ఫైర్‌ అయ్యారు. మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్‌ వెన్నతో పెట్టిన విద్య . ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం వైయ‌స్‌ జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడు.. గూడు కల్పిస్తున్నాడు.. వైయ‌స్ జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. మా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Back to Top