తండ్రి ఆఖ‌రి కోరిక తీర్చ‌లేని స‌న్నాసులు మీరు

నంద‌మూరి బాల‌కృష్ణ‌పై మంత్రి జోగి ర‌మేష్ ఫైర్‌

బాల‌కృష్ణ‌కు చిత్త‌శుద్ధి ఉంటే పున‌ర్జ‌న్మ‌నిచ్చిన వైయ‌స్ఆర్‌కు రుణ‌ప‌డి ఉండాలి

ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణ‌ప‌డి ఉండాలి

చంద్ర‌బాబు అనే శున‌కం విసిరే ఎంగిలిమెతుకుల‌కు ఆశ‌ప‌డ్డారు

గ‌తంలో బాబు కేరాఫ్‌ అడ్రస్‌ నందమూరి.. ఈరోజు నందమూరి ఫ్యామిలీ కేరాఫ్‌ నారా

బాల‌కృష్ణ‌కు పౌరుషం ఉంటే నీ తండ్రిని చంపిన చంద్ర‌బాబుపై ఫైట్ చేయాలి

చంద్రబాబు అనే శునకం కొడుక్కి నీ బిడ్డను ఎలా ఇచ్చావ్‌

ఎన్టీఆర్ అంటే మా నాయ‌కుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే గౌర‌వం ఎక్కువ‌

తాడేపల్లి: ‘‘నందమూరి బాలకృష్ణకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే నీకు పునర్జన్మనిచ్చిన మహానేత వైయస్‌ఆర్‌కు, మీ తండ్రి చరిత్రలో చిరస్థాయిలో మిగిలిపోయే విధంగా కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన డాక్టర్‌ వైయస్‌ఆర్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌కి రుణపడి ఉండాలి’’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. చంద్రబాబు అనే శునకం విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆయన పంచన చేరార‌ని ధ్వజమెత్తారు. 73 సంవత్సరాల వృద్ధాప్యంలో మీ తండ్రి ఎన్టీఆర్‌ కోరిన చివరి కోరిక కూడా తీర్చలేని సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అని నందమూరి బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్‌ విరుచుకుపడ్డారు. బాలకృష్ణ నిజంగా ఎన్టీఆర్‌ రక్తం పంచుకొని పుడితే.. పౌరుషం ఉంటే సినిమాల్లో ఫైట్లు చేయడం కాదు.. మీ నాన్నను పైకి పంపించి, మీ నాన్న పార్టీని, గుర్తును, ట్రస్టును, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్న నారా చంద్రబాబు మీద ఫైట్‌ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ ఏం మాట్లాడారంటే..

‘నందమూరి బాలకృష్ణ మూడ్రోజుల తరువాత స్పృహలోకి వచ్చి.. ఎన్టీఆర్‌ పేరును ఎవరూ చెరిపేయలేరని, జాతికి, సమాజానికి ఆయన్ను దూరం చేయలేరని ట్వీట్‌ చేశాడు. అసలు జాతికి, సమాజానికి ఎన్టీఆర్‌ను ఎవరు దూరం చేశారు. ఎవరు వెన్నుపోటు పొడిచారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచే క్రమంలో, ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని, గుర్తును, ట్రస్టును లాక్కొని ముఖ్యమంత్రి పీఠం మీద మీ బావ చంద్రబాబు అనే శునకాన్ని కూర్చోబెట్టడం కోసం ఎంత దుర్మార్గుల్లా మీరు వ్యవహరించారో అందరికీ తెలుసు. ఆ శునకానికి తోక ఈ బాలకృష్ణ కాదా..? కుటుంబ విలువలను దిగజార్చి.. తుంగలో తొక్కి, తండ్రి పెట్టిన పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచిన శునకం వెంట నడిచింది మీరు కాదా..? 

చంద్రబాబు అనే శునకాన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి బాబు విసిరిన ఎంగిలి మెతుకులు తిన్న మీరు కూడా మాట్లాడుతున్నారు.. మీకు అసలు నైతిక విలువలు ఉన్నాయా..? ఎన్టీఆర్‌ను కూలదోసినప్పుడు ఎంత చక్కగా నవ్వుతున్నారో.. సిగ్గుండాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ అందరినీ చంద్రబాబు వాడేసుకున్నాడు. చంద్రబాబు అనే శునకం మీ కుటుంబాన్ని వాడుకున్నాడు.. మీ కుటుంబంలో చిచ్చులు పెట్టాడు.. చెట్టుకు, పుట్టకొకరిని చేశాడు. అయినా సిగ్గులేకుండా.. తండ్రి మరణానికి కారణం అయిన నారా చంద్రబాబు కొడుక్కి సిగ్గులేకుండా పిల్లను ఇచ్చావే.. నిన్ను ఏమనాలి బాలకృష్ణ శునకం. సినిమాల్లో డైలాగులు చెబుతావు.. బయట దద్దమ్మవి. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు శునకం స్క్రిప్టు రాసిస్తే.. ఆ స్క్రిప్టును ట్వీట్‌ చేస్తున్నాడు. ఇది మీ శునకాల పరిస్థితి. 

14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బావ, మీ కుటుంబంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేశారు. ఏరోజు అయినా చరిత్రపుటల్లో ఎన్టీఆర్‌ పేరు ఉండాలనే ఆలోచన చేశారా..? ఈరోజు సగర్వంగా చెబుతున్నాం.. ఎన్టీఆర్‌ పేరు చరిత్రపుట్టల్లో చెరగని విధంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేసిన మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. మాకు ఎన్టీఆర్‌ మీద అభిమానం ఉంది కాబట్టే ఎన్టీఆర్‌ పేరు గుర్తుండేలా చేయగలిగాం. 

ఎన్టీఆర్‌ పేరు మేము పెట్టాం కదా.. ఆయన రక్తంతో పుట్టిన నువ్వు ఈ ట్వీట్‌ ఎందుకు ఆ రోజున చేయ‌లేక‌పోయావ్‌. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అని ఎందుకు ట్వీట్‌ చేయలేకపోయావ్‌. `ఎన్టీఆర్‌ పిల్లలైన మీకు పౌరుషం ఉంటే, మీరు నా కడుపున పుట్టి ఉంటే.. మీరు నా రక్తమాంసాలు పొంది ఉంటే.. నా బిడ్డలే అయితే నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పి రండి.. 73 సంవత్సరాల వృద్ధాప్యంలో చివరి కోరిక కోరాడు.` ఆ కోరికను కూడా తీర్చలేని సన్నాసులు, దద్దమ్మలు, చవట సుంఠ‌లు మీరు. ఈరోజు మీరు ఎన్టీఆర్‌ మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రపంచానికి ఎన్టీఆర్‌ను మీరేదో తెలియజేస్తున్నట్టు నాటకంలో జీవిస్తున్నారు. 

బాలకృష్ణకు జన్మను ఇచ్చింది ఎన్టీఆర్‌ అయితే.. పునర్జన్మను ఇచ్చింది డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని మాత్రం గుర్తుపెట్టుకో.. కావాలంటే గతాన్ని గుర్తుచేసుకో.. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ మీ తండ్రి గౌరవాన్ని దశదిశలా చాటారు. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే.. నిజంగా రుణపడాల్సింది నీకు పునర్జన్మను ఇచ్చిన డాక్టర్‌ వైయస్‌ఆర్‌కు, మీ తండ్రి చరిత్రలో చిరస్థాయిలో మిగిలిపోయే విధంగా కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన డాక్టర్‌ వైయస్‌ఆర్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌కి రుణపడి ఉండాలి. 

చంద్రబాబు శునకం దగ్గర చవట సన్నాసుల్లా చేరిపోయారు. చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ నందమూరి.. ఈరోజు నందమూరి ఫ్యామిలీ కేరాఫ్‌ నారా. ఎంత పనికిమాలినవారు అయిపోయారో ఆలోచన చేసుకోండి. ఎన్టీఆర్‌ కుమారులు పరమసుంఠలు. యూనివర్సిటీకి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ పేరు పెడతామని టీవీలు, పేపర్లలో గ‌త వారంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్పుడు బాధ్యత గల శాసనసభ్యుడివి అయితే.. ఎన్టీఆర్‌ని చరిత్రలో నిలబెట్టాలనుకుంటే.. అసెంబ్లీలో చర్చపెడతామని తెలిసి కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయావ్‌.. అసెంబ్లీకి వస్తే ఎందుకు మాట్లాడలేకపోయావ్‌. బాధ్యతలేని వ్యక్తులు, బంధాలను, రక్తసంబంధాలను వదిలేసి.. ఎంగిలిమెతుకుల కోసం పనికిమాలిన వారిలా చంద్రబాబు పంచన చేరిన మీరు.. సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడిది.. తండ్రిని వల్లకాటికి పంపించిన వ్యక్తి కొడుక్కు పిల్లనిచ్చావంటే.. సిగ్గు,శరం వదిలేసిన బతుకులు మీవి. 

చనిపోయిన 27 సంవత్సరాల తరువాత ఎన్టీఆర్‌ గుండెల్లో ఉన్నాడు.. గుడిలో ఉన్నాడు, గుండీల్లో ఉన్నాడు.. పెద్ద పెద్ద డైలాగులు, పెట్టుడు మీసాలు పెట్టుకొని మెలేయడం.. బాలకృష్ణ సినిమాల వరకే మీ డైలాగులు పరిమితం. యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక జిల్లా చరిత్ర పుటల్లో మిగిలిపోయే విధంగా, చిరస్థాయిగా ఉండే విధంగా గౌరవించాం. గుర్తించాం. అభిమానం మా నాయకుడికి ఉంది కాబట్టి ఎన్టీఆర్‌ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. 

నువ్వు నిజంగా ఎన్టీఆర్‌ రక్తం పంచుకొని పుడితే.. నీకు పౌరుషం ఉంటే సినిమాల్లో ఫైట్లు చేయడం కాకుండా.. మీ నాన్నను పైకి పంపించిన, మీ నాన్న పార్టీని, గుర్తును, ట్రస్టును, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్న నారా చంద్రబాబు మీద ఫైట్‌ చేయి.. అప్పుడు ప్రజలంతా నమ్ముతారు’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top