అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం మూడు ఏళ్లలోనే రూ.1.42 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు. అందులో 80 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల వారున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడుస్తున్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. మంత్రి వర్గం మొదలు.. నామినేటెడ్ పనులు, పదవుల్లోనూ అగ్రభాగం వెనుకబడిన వర్గాలకే అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులు ఇస్తానని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నీవు, ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? అని నిలదీశారు.