మాది డీబీటీ.. బాబుది డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో)

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్  

 బాబుకు ఉన్న ఫ్రెండ్స్ రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, ఇతర ఎల్లో మీడియా, దత్తపుత్రుడు
 
మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 1.15 లక్షల కోట్లు.. 8  లక్షల కోట్లు అన్నది బాబు అక్కసు మాత్రమే

 బాబు హయాంలో అప్పులు పెరిగినంతగా మా హయాంలో పెరగలేదు

 మూడేళ్ళలో సంక్షేమానికి రూ. 1.65 లక్షల కోట్లు ఖర్చు చేశాం

 బాబు అంటే వెన్నుపోటు, వంచన, మోసం, దగా 

 హుద్ హుద్ లో జీవో మాత్రమే బాబు ఇచ్చాడు.. సాయం మాత్రం చేయలేదు

హుద్ హుద్ లో ఫోటోలు-పబ్లిసిటీ తప్ప బాబు చేసిందేమీ లేదు

హుద్ హుద్ లో బాబు పంచింది పాచిపోయిన పులిహోర, 10 కేజీల బియ్యం మాత్రమే.. దానికి నేనే సాక్ష్యం 

 హుద్ హుద్ లోగానీ, తన 5 ఏళ్ళ పాలనలో గానీ బాధితులకు బాబు అందించిన తక్షణ సాయం సున్నా

 హుద్ హుద్ పేరుతో బాబు చేసింది వంచన..  సహాయం అందిందని ఆరోజుల్లో ఏ ఒక్కరూ చెప్పలేదు

 హుద్ హుద్ పేరుతో వసూలు చేసిన విరాళాలు ఎన్టీఆర్ ట్రస్టుకు వెళ్ళాయా లేక బాబు ఇంటికి వెళ్ళాయా..!?

విశాఖ‌: మాది డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్‌)..చంద్ర‌బాబుది డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అభివ‌ర్ణించారు. బాబు పాలనలో ఉన్నదంతా.. ఆ నలుగురు, ఆ దుష్టచతుష్టయం, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ-5.. వీరి విధానం.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే అన్నారు. శ‌నివారం మంత్రి విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. 
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే...

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. చంద్రబాబుకు ఉన్న ఫ్రెండ్స్ ఎవరంటే..
    1. రామోజీ
    2. రాధాకృష్ణ
    3. బీఆర్ నాయుడు
    4. ఇతర ఎల్లో మీడియా

- వీరితో పాటు దత్తపుత్రుడు. 

2- మరోమాట కింద చెప్పాలంటే.. చంద్రబాబుకు ఉన్న ఫ్రెండ్స్ః
    1. వెన్నుపోటు
    2. వంచన
    3. మోసం
    4. దగా

3- బాబు ఎంత పచ్చి అబద్ధాలు చెబుతాడు అంటే.. వివరించడానికి రెండు ఉదాహరణలు చెబుతున్నాను.
    1. రాష్ట్రం అప్పుకు సంబంధించి ఆయన చెబుతున్న అబద్ధాలు
    2. హుద్ హుద్ కు సంబంధించి ఆయన చెబుతున్న అబద్ధాలు

4- ఇందులో మొదటిది రాష్ట్ర అప్పులకు సంబంధించి..  ఆయన చెబుతున్న అబద్ధాలను చూడండి. 
- రాష్ట్రం అప్పుః రూ. 8 లక్షల కోట్లు అయిందని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు
- కనీసం తన దుష్ట పత్రిక ఈనాడులో రాసిన వార్తల్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. 
- మొన్ననే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా ఏం చెప్పిందంటే- రాష్ట్ర విభజన తర్వాత గత మూడేళ్ళలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు, కాగ్ లెక్కల ప్రకారంః రూ.1.15 లక్షల కోట్లు మాత్రమే.
- మరి ఈ 8 లక్షల కోట్ల లెక్క ఎక్కడ నుంచి వచ్చింది..?
- ఎక్కడ నుంచి వచ్చిందంటే అక్కసు నుంచి వచ్చింది.
- మరొక ముఖ్య విషయం కూడా చెబుతున్నాను..
- ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం - జగన్ గారి ప్రభుత్వం గడిచిన మూడేళ్ళలోనే, గత కాలపు అప్పులకు కట్టిన వడ్డీనే ఏకంగా రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్ల వరకూ ఉంది. 
- కేవలం రూ. 1.15 లక్షల కోట్ల అప్పు ఉంటే, గడిచిన మూడేళ్ళలోనే రూ. 1.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించిన ప్రభుత్వం జగన్ గారిది. 
- అంటే అప్పు కన్నా ఎక్కువగా ప్రజలకు డబ్బు ఇచ్చిన ప్రభుత్వం ఇది. 
- అదే బాబు పాలనలో చూసుకుంటే... అప్పులు తప్ప డీబీటీలు లేవు
- బాబు పాలనలో ఉన్నదంతా.. ఆ నలుగురు, ఆ దుష్టచతుష్టయం, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ-5.. వీరి విధానంః దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం..
- అందుకే మాది డీబీటీ ప్రభుత్వం అయితే.. చంద్రబాబుది డీపీటీ ప్రభుత్వం అని నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. 
- రాష్ట్రం అప్పుల్ని తీసుకున్నా, చంద్రబాబు హయాంలో కన్నా, గత మూడేళ్ళలో సీఏజీఆర్(కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) తక్కువగా ఉందని, అంటే, అసలు, వడ్డీ బాబు హయాంలో  పెరిగినంతగా, మా హయాంలో పెరగలేదని స్పష్టంగా కనిపిస్తోంది. 
- మరి ఇలాంటప్పుడు, బాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని ఎవరికైనా అర్థమవుతుంది. 

5- ఇక హుద్ హుద్ గురించి బాబు చెబుతున్నది .. ఏ కొంచెమైనా సిగ్గు, మొహమాటాలు లేకుండా చెబుతున్న పచ్చి అబద్ధంః
- ఇందుకు సంబంధించిన నిజాలు నేను చెబుతాను.
    1- హుద్ హుద్ వల్ల మొత్తం కలిగిన నష్టంః రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్ల వరకు. ఈ విషయాన్ని స్వయంగా ఎల్లో మీడియానే రాసింది, వేసిందీ. 
    2- హుద్ హుద్ లో బాబు అర్జెంటుగా ఏం చేశాడు అంటే.. ఫోటోలు తీయించుకోవడం తప్ప చేసిందేమీ లేదు. 
    3- హుద్ హుద్ లో బాబు పంచింది.. కేవలం పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు మాత్రమే. 
    4- హుద్ హుద్ లో బాబు ఇచ్చిన బియ్యం ఎంత అంటే.. కేవలం 10 కేజీలు మాత్రమే
    5-హుద్ హుద్ లోగానీ, బాబు 5 ఏళ్ళ పాలనలో గానీ తుఫాన్లు వచ్చినప్పుడు బాధితులకు బాబు డబ్బు రూపంలో అందించిన తక్షణ సాయం ఎంత అంటే.. సున్నా. ఒక్క రూపాయి కూడా అందించలేదు. 
    6- హుద్ హుద్ సమయంలో బాబు చేసిన అతి గొప్ప పని ఏంటంటేః ఏ సహాయమూ ఎవరికీ చేయకుండానే ఒక జీవో విడుదల చేయటం. జీవో విడుదల చేయటం తప్ప బాబు చేసిన సాయం అంటూ ఏమీ లేదు. 
    7- బాబు విడుదల చేసిన జీవో ఎక్కడా, ఎప్పుడూ అమలు కాలేదు. 
    8- ఇదే హుద్ హుద్ ప్రాంతంలో ఈ మూడు జిల్లాల్లో మా నాయకుడు జగన్ గారు 11 రోజులు పర్యటిస్తే... ఆ పర్యటన మొత్తం నేను కూడా ఉన్నాను. నేనే ప్రత్యక్ష సాక్షిని. 
    9- ఆరోజుల్లో ఏ ఒక్క బాధితుడు కూడా, ఈ మూడు జిల్లాల్లో మాకు సాయం అందింది అని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. 
    10- హుద్ హుద్ సహాయంగా కేంద్ర  ప్రభుత్వాన్ని అడగటం, వారు ఇచ్చిన రూ. 500 కోట్లను అక్కడా ఇక్కడా కొంత పంచి, మిగిలినదంతా టీడీపీ తినేయటం తప్ప బాబు చేసిందేమీ లేదు. 
    11- అంతే కాకుండా, హుద్ హుద్ పేరు చెప్పి భారీగా విరాళాలు వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆ విరాళాలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వెళ్ళాయా.. లేక బాధితులకు వెళ్ళాయా లేక నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళాయా..?
    12- అదే ఇప్పుడు మా ప్రభుత్వంలో చూడండిః 
        1- జులైలో ఏకంగా 27 లక్షల క్యూసెక్కుల వరద చరిత్రలోనే ఎప్పుడూ లేదు. అయినా, ఈ వరదల్లో గ్రామాలుగానీ, ప్రజలుగానీ కొట్టుకుపోయే పరిస్థితి లేకుండా, లంక గ్రామాలు సహా, ప్రతి ఒక్క మనిషినీ రక్షించుకున్నాం. ప్రాణ నష్టం లేకుండా చూసుకోగలిగాం. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల్ని తక్షణం పునరావాస కేంద్రాలకు పంపించాం. అక్కడ ఆహార సరఫరా చేశాం. 
    2- అన్నింటికంటే ప్రధానంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఇతర సరుకులు రూ. 2 వేలు నగదు ఇచ్చాం. చంద్రబాబు తన మొత్తం పరిపాలనలో ఏనాడూ తక్షణ సహాయంగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. 
    3- అంతే కాకుండా, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం మీద ప్రధానంగా దృష్టి  పెట్టి, నవరత్నాల పథకాలన్నింటినీ ప్రతి ఇంటికీ అందించాం. కాబట్టే, ఈరోజున గడప గడపకూ వెళ్ళి టీడీపీ కార్యకర్తలతో సహా అందరికీ ఎంతెంత అందిందో చెప్పగలుగుతున్నాం. 
    4- అన్నింటికీ మించి, అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే, మేం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, 5 నెలల్లోపే ఏర్పాటు చేసిన గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ బాగా ఉపయోగపడ్డాయి కాబట్టే ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంలో, ప్రజలను కాపాడటంలో, వారికి సహాయం అందించడంలో, వరద నష్టాన్ని అంచనా వేయడంలో.. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడింది. అంతేకాకుండా, 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా మార్చడంతో, రెండు గోదావరి జిల్లాలు కాస్తా ఆరు జిల్లాలుగా మారాయి. ఇద్దరు కలెక్టర్లు ఆరుగురు కలెక్టర్లు అయ్యారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లతో పరిపాలన వ్యవస్థ గతంలో ఎప్పుడూ చూడని విధంగా కష్టపడి పనిచేసింది. 

    5- నిజాలు ఇలా ఉంటే, 10 కేజీలు బియ్యం, పాచిపోయిన పులిహోర ప్యాకెట్ల నాయుడు, తాను చేయనివన్నీ చేశానని ఒక జీవో పట్టుకుని చదువుతాడు. ఇంతకన్నా, పెద్ద వంచన ఎక్కడైనా ఉంటుందా..?

6- మేం డీబీటీ వర్సెస్ డీపీటీ అంటుంటే.. చంద్రబాబుకు ఏమీ అర్థం కావడం లేదు. కాబట్టే, వరద ప్రాంతాలకు వెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 
- మరొకసారి చెబుతున్నాం. చంద్రబాబుది.. దోచుకో, పంచుకో, తినుకో.. విధానం మాత్రమే.

తాజా వీడియోలు

Back to Top