సొసైటీలతో సంబంధం లేకుండా.. జర్నలిస్టులకే ఇళ్ల స్థలాల పంపిణీ

ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌ దృష్టిలో జర్నలిస్టులందరూ సమానమే

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: సొసైటీలతో సంబంధం లేకుండా నేరుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. సంక్రాంతి కానుకగా ఇల్లు ఇవ్వాలని కోరితే.. దీపావళికే సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారన్నారు. కేబినెట్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు నిర్ణయానికి ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 

పాదయాత్రలో ఇచ్చిన వినతులను పరిగణలోకి తీసుకొని సీఎం వైయస్‌ జగన్‌ ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని చెప్పారు. సొసైటీలతో సంబంధం లేకుండా నేరుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విశాఖలో 2005 అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల సమస్యను సీఎం పరిష్కరించారని గుర్తుచేశారు. యాజమాన్యాల తీరు ఎలా ఉన్నా.. ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌ దృష్టిలో జర్నలిస్టులందరూ సమానమేనన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన అని, రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎక్కువ మంది విశాఖలో ఇళ్ల స్థలాలు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అమర్నాథ్‌ చెప్పారు. 
 

Back to Top