పారిశ్రామిక అభివృద్ధి దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

మూడేళ్లలో రూ.46 వేల కోట్ల పెట్టుబడితో 99 భారీ పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యాయి

రాబోయే రోజుల్లో రాష్ట్రానికి రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు, మరో 1.25 లక్షల మందికి ఉద్యోగాలు

రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 35 వేల ఎంఎస్‌ఎంఈలు.. 2,11,374 మందికి ఉద్యోగాలు 

4 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను 6 లక్షలకు పెంచిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

కరోనా ప్రభావంలోనూ 19,983 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాం

17 రాష్ట్రాలతో పోటీపడి బల్క్‌డ్రగ్‌ పార్కును సాధించుకున్నాం

రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ప్రతిపక్షం కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తోంది

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఆంధ్రరాష్ట్రం అగ్రగామిగా నిలిచింది

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే కడుపుమంటతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తుందని, 17 రాష్ట్రాలతో పోటీ పడి సాధించుకున్న బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏపీకి వద్దంటూ ఏకంగా కేంద్రానికి లేఖలు రాస్తోందని మండిపడ్డారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడారు. 

‘‘పారిశ్రామిక రంగానికి సంబంధించి అనేక సందర్భాల్లో సీఎం వైయస్‌ జగన్‌ గడిచిన నాలుగు నెలలుగా అనేక పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో సీఎం చాలా క్లియర్‌గా చెప్పారు. ఏయే సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా సహకరిస్తుందో అనేక సందర్భాల్లో చెప్పారు. ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్‌ కాల్‌ దూరంలోనే ప్రభుత్వం ఉంది.. ఏ ఆటంకం కలిగినా ప్రభుత్వం నుంచి సహకారం అందించి త్వరితగతిన ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాం.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయికి విలువ తీసుకువస్తాం. ప్రశాంతమైన వాతావరణంలో పరిశ్రమలు నడుపుపుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం చెప్పారు. 

గడిచిన రెండు సంవత్సరాలుగా ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులను బేస్‌ చేసుకొని ర్యాంకింగ్స్‌ వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో పూర్తిగా పర్షప్సన్‌ సర్వే. రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించి థర్డ్‌ పార్టీతో 301 అంశాల మీద ర్యాండంగా సర్వే చేసి ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ఏపీ మొట్టమొదటి స్థానంలో నిలిచినందుకు గర్వపడుతున్నాం. 97.89 శాతంలో నిలిచింది. సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఏ విధమైన సహకారం అందిస్తుందో ఈవోడీబీ ర్యాంకింగ్‌ తార్కాణం.

రాష్ట్ర ప్రభుత్వం ఈవోడీబీలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈజ్‌ ఆఫ్‌ సేలింగ్‌ ఇండస్ట్రీలో ముందున్నారు. ఆయన తాలూకా 9 సంవత్సరాల సమయంలో ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌ అనే విధానాన్ని నడిపాడు. ఆ పుస్తకానికి సంబంధించి అచీవ్‌మెంట్స్‌ ఫ్రమ్‌ 1999–2004 పేజీలో ఫేజ్‌ –1, ఫేజ్‌–2 పొందుపరిచారు. 1999–2004 మధ్యలో దేశ వ్యాప్తంగా దాదాపు 160 ఇండస్ట్రీ (పబ్లిక్‌ సెక్టార్, కోఆపరేటివ్‌ సెక్టార్‌) మూతపడిపోతే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 60 ఇండస్ట్రీని మూసివేసిన ఘనత చంద్రబాబుది. 

అచీవ్‌మెంట్స్‌లో ఏపీ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఏపీ టెక్స్‌›్టటైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్,ఆల్వీన్‌ వార్చెస్, నెల్లూరు కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్, చీరాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్, చిలకలూరిపేట కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌ ఇలా అనేక ఇండస్ట్రీస్‌ మూసేశాడు. 

రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలు వెళ్లిపోతున్నారని, ఏ పరిశ్రమ రాష్ట్రానికి రావడం లేదని చెప్పి.. వారి పత్రికలు, ఛానళ్ల ద్వారా దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. ఈ రాష్ట్రంలోని పేదవాడికి మంచి చేయాలని, పేదల బతుకుదెరువు మార్చాలని, అనేక పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారు. గడిచిన మూడున్నరేళ్లుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అది మా ఫోకస్‌.. పేదల బతుకులు మార్చాలనే ఫోకస్‌ మీదనే సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారు కాబట్టే రూ.1.65 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో డీబీటీ ద్వారా అందించారు.

గడిచిన ప్రభుత్వం కంటే ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత కూడా 99 భారీ పరిశ్రమలు, దాదాపు 46 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గడిచిన మూడు సంవత్సరాల్లో పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యాయి. లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీకి సంబంధించి 46 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్‌ జరిగాయి. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి దాదాపు 35 వేల పరిశ్రమలు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 2,11,374 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి పబ్లిసిటీ, మార్కెటింగ్‌ ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రానికి ఇండస్ట్రీస్‌ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

అమరావతి పుస్తకావిష్కరణ సభలో దాదాపు అరగంటలో 20 నిమిషాలు హైదరాబాద్‌ గురించి చంద్రబాబు మాట్లాడాడు. 420 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో చంద్రబాబు పనిచేసింది 9 సంవత్సరాలు. 1591లో కుతుబ్‌ షాహీల నుంచి హైదరాబాద్‌ ప్రారంభమైంది. చంద్రబాబు మొగల్‌ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తిలా, నిజాం నవాబుల కుటుంబం వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సభలో మాట్లాడుతూ తమ్ముళ్లూ మీ సెల్‌ఫోన్లు బయటకు తీయండి.. ఎంత బాగా వాడుతున్నారు తమ్ముళ్లు.. నేను కనిపెట్టిన ఫోన్లు అని మాట్లాడుతున్నాడు. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ నేనే కనిపెట్టానని చెప్పుకుంటాడు. ఫాదర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కూడా నేనే అని చంద్రబాబు గొప్పలు, ప్రచారాలు చేసుకుంటున్నాడు. 

సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచిని పక్కరాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి.. ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నాడు–నేడు అనే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రధానమంత్రి ఆలోచన చేస్తున్నారు. పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ల పేరుతో దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. తీరా అంతా చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలకు రూ.34 వేల కోట్ల వచ్చింది. పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ల పేరుతో సూట్లు వేసి.. ఫోటోలు తీసుకోవడం సరిపోయింది. తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు 4 లక్షల మంది ఉంటే.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ సంఖ్యను 6 లక్షలకు తీసుకెళ్లారు. 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, వైద్యరంగంలో 45వేల మందిని రిక్రూట్‌ చేసుకుంటే అందులో 20 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్‌ చేసి.. ఆ సంఖ్యను 6 లక్షలకు పెంచిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. ఎంఎస్‌ఎంఈల ద్వారా 2.11 లక్షల మంది, లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ ద్వారా 70 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. 

974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరం. నాలుగు పోర్టులు నూతనంగా నిర్మించాలని, 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించారా..? దాదాపు 19 వేల కోట్లు కేవలం మ్యారీటైమ్‌ బోర్డు ద్వారా ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు నిర్మిస్తే.. ఇండస్ట్రీ డెవలప్‌ అవుతుందనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న గొప్ప ఆలోచన ఇది. 

అనేక పారిశ్రామిక సంస్కరణలు చేపట్టాం. వైయస్‌ఆర్‌ నవోదయం, వైయస్‌ఆర్‌ బడుగు వికాసం వంటి కార్యక్రమాలు చేపట్టాం. ఐటీకి సంబంధించి కూడా గడిచిన మూడేళ్లలో (కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ) 19,983 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిది. రానున్న కాలంలో (కేబినెట్‌ అప్రూవల్, ప్రభుత్వంతో ఎంవోయూ) 1.57 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. దీంతో పాటు మరో 1.25 లక్షలమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. మరో నాలుగు పబ్లిక్‌ సెక్టార్‌ ఇండస్ట్రీస్‌ కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 80 వేల మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది. 

ఎంఎస్‌ఎంఈలకు ఏరకమైన చేయూతనిచ్చామో అందరికీ తెలుసు. గడిచిన రెండు సంవత్సరాల్లో 1324 కోట్లు ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు రీస్టార్ట్‌ ప్రోగ్రాం అమలు చేశాం. గడిచిన ప్రభుత్వాలు విడిచిపెట్టిన బకాయిలను కూడా సీఎం వైయస్‌ జగన్‌ తీర్చారు. 

అత్యంత ప్రతిష్టాత్మకమైన బల్క్‌ డ్రగ్‌ పార్కు గురించి దేశంలోని 17 రాష్ట్రాలు పోటీపడితే దక్షిణ భారతంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పడానికి గర్వపడుతున్నాం. తీరా పార్కు రాష్ట్రానికి కేటాయిస్తే.. మరుసటి రోజే ప్రతిపక్షం కేంద్రానికి లేఖ రాసింది. బల్క్‌ డ్రగ్‌ పార్కు వస్తే కడుపునొప్పి వస్తుందని లేఖలు రాశారు. వారి కడుపుమంటకు  కూడా బల్క్‌ డ్రగ్‌ పార్కులో మందులు తయారు చేస్తారు. దాదాపుగా 15 వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి, రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్‌ పార్కును వద్దని మాట్లాడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ ఏపీకి వెళ్లిపోయిందని పక్కనున్న రాష్ట్రాలు ఈర్ష్యపడుతున్నాయి. ఏపీ అభివృద్ధి కోసం సీఎం సాధించుకొని వస్తున్న పరిశ్రమలను వద్దంటూ లేఖలు రాస్తున్నారు. 

దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో మరో 30 సంవత్సరాల్లో విశాఖపట్నం అనే నగరం ఉండదు.. ఈ నగరం అంతరించిపోతుంది.. సముద్రం విశాఖను మింగేస్తుందని రాశాడు. సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను పరిపాలన రాజధాని చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఇలాంటి రాతలు రాశారు. సముద్రం కాదు.. గత ఐదేళ్లలో టీడీపీ వారే విశాఖను మింగాల్సినంత మింగేశారు. విశాఖకు గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు. దివంగతమహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖలో అచ్యుతాపురం సెజ్‌ తీసుకువచ్చారు. బ్రాండిక్స్‌ ఇండస్ట్రీలో 22వేల మంది పనిచేస్తున్నారు. ఒక కంపెనీ వస్తే దాని ద్వారా నలుగురికి మేలు జరగాలి. ఫార్మాసిటీలో 35 వేల మంది పనిచేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బీచ్‌ ఐటీ డెస్టినేషన్‌గా విశాఖను ప్రమోట్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలు విశాఖ నుంచి వారి ఆపరేషన్స్‌ మొదలుపెడుతున్నాయని గర్వంగా చెబుతున్నాను. కడపలోని కొప్పర్తి, తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, విశాఖ–చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్, హైదరాబాద్‌ బెంగళూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్, చెన్నై–బెంగళూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ వీటన్నింటి మీద దాదాపు 48 వేల ఎకరాలు పారిశ్రామికంగా  విశాఖ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. 

జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపుమంటతో ఉన్న ప్రతిపక్షం ఇప్పటికైనా మంచిచేయకపోగా.. రాష్ట్రం బ్రాండ్‌ఇమేజ్‌ను దెబ్బతీయొద్దని కోరుకుంటున్నాం. పారిశ్రామిక అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో మరింతగా ముందుకు తీసుకెళ్తాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందడుగు వేస్తాం. 
 

Back to Top