ఆర్థిక ఆస‌రా.. వైయ‌స్ఆర్‌ చేయూత

వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా న‌డి వ‌య‌స్సు మ‌హిళ‌ల‌కు ఆర్థిక ఆస‌రా క‌ల్పించార‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం ద్వారా జిల్లాలో ఎనిమిది వంద‌ల కోట్లు అంద‌జేశామ‌న్నారు. ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు అపోహ‌లు ఉన్నాయ‌ని, కానీ త‌మ ఉద్దేశాల‌ను అర్థం చేసుకుంటే ఎటువంటి అస‌త్య ప్రచారాల‌కూ తావే లేద‌ని స్ప‌ష్టం చేశారు. స్థానిక 80 అడుగుల రోడ్ లోని అనండమయి ఫంక్షన్ హాల్లో వైయ‌స్ఆర్‌ చేయూత మూడో విడత సంబరాలు నిర్వహించారు. ఈ సదర్భంగా రూర‌ల్ మండ‌లంకి చెందిన  వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌క ల‌బ్ధిదారుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎక్క‌డా అవినీతికి తావే లేద‌ని, పెద్ద మార్పు అన్న‌ది ప‌థ‌కాల అమ‌లుతోనే సాధ్యం అని, జీవ‌న ప్ర‌మాణాల మెరుగుద‌ల సాధ్యం అని అన్నారు. ఈ ఏడాది చేయూత ద్వారా మూడు వంద‌ల కోట్ల రూపాయ‌లు పైగా అందించామ‌ని అన్నారు. మండలంలోని 6,937 మంది లబ్ధిదారలకు రూ.13.69 కోట్లు అందించినట్లు తెలిపారు. ఇంటికి ఇల్లాలే దీపం అని, అలాంటి వెలుగు ఇచ్చే శ‌క్తికి మ‌రింత తోడ్పాటు ఇచ్చే విధంగా చేయూత ప‌థ‌కం ద్వారా అందిస్తున్నామ‌ని, మీరు శ‌క్తి వంతులు అయితే ఇల్లూ, పిల్ల‌లూ బాగుంటార‌ని, బాగుంటాయ‌ని, బాగు చేస్తార‌ని భావిస్తూ వైఎస్ జ‌గ‌న్ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని అన్నారు. 

మహిళ‌ల‌ను ఆర్థిక ప‌రంగా  శ‌క్తి ప‌రులను చేయాల‌ని భావించారు. 45 నుంచి అర‌వై ఏళ్ల లోపు ఉన్న మ‌హిళ‌ల‌కు ఏడాదికి 18 వేల 750 రూపాయ‌లు అందిస్తున్నామ‌ని, వీటిని వినియోగించుకోవాల‌ని, ఆర్థిక సంఘాల బ‌లోపేతానికీ కృషి చేస్తున్నా మ‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన ఏ హామీని నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు. అదేవిధంగా ఇప్ప‌టికే స్వ‌యం శ‌క్తి సంఘాల డ్వాక్రా రుణాలు  తీర్చేందుకు హామీ ఇచ్చి,ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో తీర్చేశామ‌ని అన్నారు. మ‌హిళ‌ల ఆత్మ గౌర‌వం కాపాడే పార్టీ ఏకైక పార్టీ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. పింఛ‌ను త‌ప్పు అని ఎవ్వ‌ర‌న్నా, మీ బిడ్డ‌లు చ‌ద‌వే బ‌డులు బాగు చేయ‌డం త‌ప్పియితే, పెట్టుబ‌డి సాయం త‌ప్పు అయితే వీట‌న్నింటిపై మీరు త‌ప్పక ప్ర‌శ్నించుకోవాలి అని, అదేవిధంగా ఒక‌వేళ ఒప్పు అయితే ఈ ప్ర‌భుత్వానికి మ‌రోసారి మ‌ద్ద‌తు గా నిల‌వండి అని, మేలు చేసే ప్ర‌భుత్వం విష‌య‌మై అస‌త్య ప్ర‌చారం తిప్పుకొట్టాల‌న్నారు.

ప్ర‌జాక్షేమం కోరి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, అదేవిధంగా పేద‌ల‌కు నిలువ నీడ క‌ల్పించేందుకు 15 ల‌క్ష‌ల ఇళ్లు క‌ట్టించి ఇవ్వ‌నున్నామ‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వం పేద‌ల‌కు నిలువ నీడ, క‌డుపు నిండా భోజ‌నం అదేవిధంగా వారికో ఉన్నత స్థాయి విద్య అందించ‌డంలో ముందుంద‌ని అన్నారు. ప‌థ‌కాలు అన్నీ త‌ప్పు అయితే ఇవ‌న్నీ  ప్ర‌తిప‌క్ష నేత‌లు తీసేస్తారు అని, ఆ విధంగా తీసేస్తే పేద‌ల పొట్ట కొట్టిన వారు అవుతార‌ని, ఏ విధంగా చూసుకున్నా ప‌థ‌కాలు అన్న‌వి అంద‌రికీ మేలు చేసేవే అని పున‌రుద్ఘాటించారు. ఏ విధంగా చూసుకున్నా ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డమే ధ్యేయ‌మ‌ని, ప‌థ‌కాల విష‌య‌మై టీడీపీ చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలే అని అంటున్నారు. అన్నీ చేసిన ప్ర‌భుత్వాల‌ను మీరు ఓడిస్తార‌ని నేను అనుకోను అని అన్నారు.

అదేవిధంగా ధ‌ర‌ల విష‌య‌మై ప‌క్క రాష్ట్రాల‌తో పోల్చి త‌రువాతే మాట్లాడాలి అని హిత‌వు చెప్పారు. ప‌థ‌కాల అమ‌లులో ఏం త‌ప్పు ఉందో నాకు తెలియ‌దు, మీరే చెప్పాలి .. విప‌క్షాల విష ప్ర‌చారంను న‌మ్మ వ‌ద్దు అని చెప్పారు. కుటుంబాన్ని బాగు చేసేందుకు, మీరు మ‌రింత ఆర్థిక వృద్ధి పొందేందుకు ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాల‌ను ఉప‌యోగించుకోండి, అదేవిధంగా మీరు 
పొదుపు చేయండి.. మీరు లీడ‌ర్లుగా ఎద‌గాలి అని కోరుకుంటున్నాను అని వెల్ల‌డించారు. ఓ పేద వాడు ఎదిగితే సంతోషించే ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..అని, ఆయ‌ను ఇంత‌కు మించి ఏమీ కోరుకోవ‌డం లేదు...అన్నారు. ఈ విధంగా ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచే, పేద‌లకు అండ‌గా నిలిచే ఇటువంటి ప్ర‌భుత్వాన్ని మ‌నం వ‌దులుకుంటామా అని ప్ర‌శ్నిస్తూ స‌భికుల నుంచి రాబ‌ట్టారు. విజ్ఞ‌త‌తో ఆలోచించి ప్ర‌జా ప్ర‌భుత్వాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.
 
యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి విద్యాసాగర్, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు,  అంబటి శ్రీనివాసరావు, చల్లా రవి కుమార్, ముకళ్ల తాత బాబు,  జెడ్పిటిసి రుప్పా దివ్య, ముకళ్ల సుగుణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top