జీవ‌న ప్ర‌మాణాల మెరుగుప‌రిచాం

  రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు.  పెద్దపాడు - 2 సచివాలయం పరిధిలోని,తంగివానిపేటలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఇంటింటా ప‌ర్య‌టించి నాలుగేళ్ల పాల‌న‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, ల‌బ్ధి వివ‌రాల‌ను తెలిపారు. స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు.

ప్రజలకు రేపటి గురించి ధీమా ఉండాలి అన్న ఉద్దేశంతో,వారి పిల్లలు మంచి విద్యావంతులు అయి ఉండాలి అన్న సంక‌ల్పంతో ప‌నిచేస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలోనే నాడు - నేడు పేరిట పాఠ‌శాల‌ల‌ను ఆధునిక వ‌సతుల‌తో తీర్చిదిద్దాం. ఇది సంపూర్ణ అభివృద్ధికి సంకేతం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా ఆకలి తో కానీ, నిరాశ తో కానీ ఉన్న దాఖలాలు లేవు. అందరికీ ప్రభుత్వమే తోడుగా ఉంది.  9 నెలలు ఉచితంగా ఇంటి వద్దకే రేషన్ తీసుకు వచ్చి ఇచ్చిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. 

అలానే ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో బెడ్స్ పెంచాము. ఆక్సిజన్ సిలిండ‌ర్లు కూడా అందుబాటులో ఉంచాము. ఇక సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యానికే వ‌స్తే.. ఇందుకు సంబంధించి పైసా లంచం ఎవ్వరూ.. మీ నుంచి తీసుకోలేదు. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం అన్న‌ది లేనేలేదు. ఇవాళ ప్రజల్లో ఉన్న సంతోషం నాలుగు సంవత్సరాల క్రితం లేదు. ఆ రోజు పిల్లలను ఎలా చదివించాలి అని త‌ర్జ‌న,భ‌ర్జ‌న ప‌డేవారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వ‌స్తే ఆస్ప‌త్రుల‌కు తిప్ప‌లేక భారంగా భావించేవారు. ఇవ‌న్నీ గ‌తం. కానీ ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆ ప‌రిస్థితి పూర్తిగా మార్చేశారు. అలానే వృద్ధుల విష‌య‌మై కూడా భ‌రోసా ఇచ్చారు. త‌మ‌ను ఎవ్వ‌రు చూసినా,చూడకపోయినా ఒక‌టో తారీఖు నాటికి మాకు పెన్షన్ వస్తుంది  అనే ధైర్యం వారిలో ఉంది. మాకు ప్రభుత్వం అండగా ఉంది అని ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలానే పేద‌,ధ‌నిక అనే తార‌త‌మ్యం అన్న‌ది లేకుండా అందరూ చదువుకునే రోజులు వచ్చాయి. అమ్మ ఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో ఏటా డ‌బ్బులు జమ చేస్తున్నాము. మీ పిల్లల విద్యకు ఆర్థిక పరిస్థితి అడ్డు కాకూడదు అని ఈ విధంగా చేస్తున్నాము.

పాలించే ప్రభుత్వం ద్వారానే ప్రజల జీవన ప్ర‌మాణం మెరుగు పడుతుంది. చంద్రబాబు రైతులనూ,మహిళా సంఘాలనూ 2014 లో మోసం చేశారు. ప్ర‌జాధ‌నాన్ని జ‌గ‌న్ వృథా చేస్తున్నార‌న్న చంద్రబాబు, ఈ రోజు ఆయ‌న పథకాలనే కాపీ కొడుతున్నారు. ఎన్నిక‌ల ముందు,త‌రువాత కూడా మాటకు నిలబడిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబు మోసం చేసిన మహిళా సంఘాలకు సీఎం జగన్ బాస‌ట‌గా నిలిచారు. ఆ రోజు తన పాద యాత్రలో ఇచ్చిన హామీ మేర‌కు ఇప్పటికే మూడు వాయిదాల్లో వారి రుణాల‌ను బ్యాంకులకు చెల్లించారు. మరొక దఫా చెల్లించాల్సి ఉంది. అది కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలానే రైతులను కూడా చంద్రబాబు మోసం చేస్తే, జగన్ అండగా ఉన్నారు. ఇక తంగివానిపేట గ్రామ ప‌రిధిలో 1200 మందికి ఇల్లు కట్టించి ఇచ్చాము.  గ్రామంలో 600 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాము. 
23 లక్షల రూపాయ‌లు వెచ్చించి పొందర వీధిలో ఇళ్ళ పై నుంచి వెళ్తున్న,అనేక ప్ర‌మాదాల‌కు తావిస్తున్న హై టెన్షన్ వైర్లను తొలగించామ‌న్నారు. అలానే వంశధార ఫేజ్  - 2 పూర్తి కావస్తోందని, గ్రామాల్లో చెరువులు ఇక ఎండే పరిస్థితులు ఉండవు అని అన్నారు.గడిచిన 24 ఏళ్లలో ఇంత పెద్ద కార్యక్రమం తంగివాని పేటలో ఎప్పుడూ జరగలేదు అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.  తొలుత రూ.7.8 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.

యువనేత ధర్మాన ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ..గ‌డిచిన 4 ఏళ్లలో తంగివానిపేటలో 13 కోట్ల 98 లక్షల రూపాయ‌లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశామ‌ని తెలిపారు. 

కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు మెంటాడ పద్మావతీ, పైడి శెట్టి జయంతి, పట్టణ  అధ్యక్షులు సాదు వైకుంఠ రావు, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, తంగి అప్పన్న, బగ్గు అసిరి నాయుడు, దశరథ్, రవి యాదవ్, కోణార్క్ శ్రీనివాస్ రావు, శిమ్మా రాజశేఖర్, పైడి రాజారావు, ఎన్ని ధనుంజయ్, చల్ల శ్రీనివాస్ రావు, అల్లు లక్ష్మి నారాయణ తదతరులు పాల్గొన్నారు.

Back to Top