ప్ర‌జారోగ్యానికి భ‌రోసా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష 

 రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు. 

శ్రీ‌కాకుళం: ప్ర‌జారోగ్యానికి భ‌రోసా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మ‌మ‌ని  రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ  జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్యక్రమంలో పాల్గొనాలి. అధికారులతో పాటు వలంటీర్లు కలిసి ఇంటింటికీ వెళ్లాలి.నాయకత్వము నిరూపించుకునే సమయం ఇది. మేము చేస్తున్నాం అనే భావనతో ఉండాలి. ప్ర‌భుత్వాలు ఎంత ఆర్థిక సాయం  చేసినా ఆరోగ్యం విషయాల్లో చిన్న కుటుంబాలు చితికి పోతున్నాయి. అలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమం. చాలా మందికి ఏ ఆరోగ్య సమస్యకు ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియదు.అలాంటి వారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయం ప్రభుత్వం నుంచి అందేవిధంగా చూడాలి. అలాంట‌ప్పుడు శ‌త్రు వర్గాలు కూడా అనుకూలంగా మారిపోతాయి. 

సీఎం వైయ‌స్ జగన్ పట్టు బట్టి మ‌రీ 55 వేల మందిని వైద్య వ్యవస్థ లో రిక్రూట్ చేశారు. ప్రభుత్వ ఆస్ప‌త్రి అంటే  చాలా చులక‌న భావ‌న ఉంది. ఆ భావ‌న‌ను తొలగించాలి. నాకు కరోనా వచ్చినప్పుడు కూడా నేను ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకున్నా. ఆ రోజు ప్ర‌భుత్వాస్ప‌త్రుల సేవ‌లు అన్న‌వి ప్ర‌జ‌ల‌కు ఎంతో బాగా ఉపప‌యోగ‌ప‌డ్డాయి. ఇవాళ కరోనా అనంత‌రం కూడా వైద్య ఆరోగ్య శాఖ‌కు అధిక నిధుల కేటాయింపు చేస్తున్నాం. గ‌ర్భిణుల‌కు అవ‌స‌రం అయిన సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాం. అలానే ప్ర‌స‌వానంత‌రం వారికి ప‌ది వేలు రూపాయ‌లు అందిస్తున్నాం. 

గత ప్రభుత్వం పాల‌న అసైన్డ్ భూములను,రాజధాని ప్రాంతంలో పేదల భూముల‌ను వేరే వారి పేరుతో చంద్రబాబు కొనిపించా రు. దుబాయ్, అమెరికాలో ఉండే బాబు బినామీలు ఆ భూములు కాజేశారు. వీటిపై కూడా ప్ర‌భుత్వం దృష్టి సారించింది. నాటి ప్ర‌భుత్వంలో జ‌రిగిన అన్యాయాలూ అరాచ‌కాల‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. అవినీతి లేని స‌మాజం ఆరోగ్య వంతం అయిన స‌మాజం అన్న‌వి మ‌న అంద‌రి ధ్యేయం కావాలి అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.

Back to Top