రాష్ట్ర ప్రజలను అమరావతికి బానిసలుగా చేయాలని బాబు కుట్ర

ఆంధ్రరాష్ట్రానికి మంచి జరిగితే దుష్టచతుష్టయానికి విపరీతమైన బాధ

ఏ హక్కు ఉందని మీ తండ్రీకొడుకులు హైదరాబాద్‌ హక్కును తాకట్టుపెట్టారు

హైదరాబాద్‌ గురించి నువ్వు, నీ కొడుకు పాదయాత్ర చేస్తే జనం చెప్పుతో కొడతారు

సోషల్‌ మీడియా వచ్చినాక తండ్రీకొడుకుల గుడ్డలు ఒక్కోటి ఊడిపోతున్నాయి

దుష్టచతుష్టయమంత‌ పెద్ద బ్లాక్‌మెయిలర్లు లేరని ప్రజలకు తెలుసు

ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు

కాకినాడ: రాష్ట్ర సంపదను అమరావతికే కేంద్రీకృతం చేసి.. రాష్ట్రంలోని ప్రజలను అమరావతి ప్రాంత ప్రజలకు బానిసలుగా చేయాలనే కుట్రకు దుష్టచతుష్టయం, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ఏ హక్కు ఉందని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌ మీదున్న హక్కును కాలరాశావని చంద్రబాబును ప్రశ్నించారు. ‘అమరావతి రైతులు పాదయాత్ర చేయడం కాదు.. హైదరాబాద్‌ను ఎందుకు వదులుకున్నావో.. నువ్వూ, నీ కొడుకు పాదయాత్ర చేస్తే.. ప్రజలంతా వరుసగా నిలబడి చెప్పుతో కొడతారు’ అని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై చంద్రబాబు, దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడారు. 

‘‘దుష్టచతుష్టయం ఆస్తులు, పెట్టుబడులు, వ్యాపారాలు, నివాసం అన్నీ హైదరాబాద్‌లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. ఈ రాష్ట్రంలో వర్షాలుపడినా, పరిశ్రమలు వచ్చినా, ఆంధ్రరాష్ట్రానికి మంచి జరిగినా దుష్టచతుష్టయానికి విపరీతమైన బాధ. వీరికి కావాల్సింది చంద్రబాబు అధికారంలో ఉండాలి. వాళ్లకు దోచిపెట్టాలి. కరోనా తరువాత ఏపీ డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించింది. కానీ, దుష్టచతుష్టయానికి చెప్పడానికి నోరు రాదు. అదే చంద్రబాబు అయితే నాలుగు ఐదు రోజులు చర్చలు, వార్తలు రాసి డబ్బాలు కొట్టుకుంటారు. 

హైదరాబాద్‌ నేనే కట్టాను.. ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు చూస్తే నాకు తృప్తి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ను వైయస్‌ఆర్‌ నిర్మించారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని, ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి కంప్లీట్‌ చేశారు. అప్పుడు కూడా ఈ దుష్టచతుష్టయం ఆ ప్రాజెక్టు మీద ఆరు నెలల పాటు విషం కక్కారు. ఈరోజు ఆ ప్రాజెక్టు చూస్తే తృప్తి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

రాష్ట్ర ప్రజల సంపదను అమరావతికే కేంద్రీకృతం చేసి.. రాష్ట్ర ప్రజలంతా అమరావతి ప్రాంత ప్రజలకు బానిసలుగా మిగిలే విధంగా దుష్టచతుష్టయం, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు, ఆయన కొడుక్కు ఏ హక్కు ఉందని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌ మీద ఉన్న హక్కును తాకట్టుపెట్టారు. అమరావతి రైతులు పాదయాత్ర చేయడం కాదు.. చంద్రబాబు, ఆయన కొడుకు హైదరాబాద్‌ గురించి వివరిస్తూ పాదయాత్ర చేయాలి. ప్రజలంతా వరసగా నిలబడి చెప్పుతో కొడతారు. 

ప్రతీ విషయంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న అన్యాయం, దుష్టచతుష్టయం చేస్తున్న అన్యాయం ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే దుష్టచతుష్టయం అంత పెద్ద బ్లాక్‌మెయిలర్లు లేరని సుమారు 75 శాతం ప్రజలకు తెలుసు. సోషల్‌ మీడియా వచ్చింది కాబట్టి చంద్రబాబు, ఆయన కొడుకు గుడ్డలు ఒక్కోటి ఊడిపోతున్నాయి.. ప్రజలకు చంద్రబాబు, దుష్టచతుష్టయం వైఖరి అర్థం అవుతుంది. ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top