ప్రభుత్వ ఉద్యోగులకు అండ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం

ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు

ఎన్‌పీఎస్‌ హడావిడీగా తీసుకున్న నిర్ణయం కాదు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదే మెరుగైన స్కీమ్‌:   మంత్రి బుగ్గ‌న‌

అమ‌రావ‌తి: ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండగా ఉంటున్నార‌ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చార‌ని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన‌ట్లు చెప్పారు. 
స‌భ‌లో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మాట్లాడారు.

►ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
►ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు.
►ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచాం.
►2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేస్తున్నాం.
►ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం.
►విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం
జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
►ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు.
►ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం.
►108 డ్రైవర్లకు జీతాలు పెంచాం.
►హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం.
►ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
► ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది.
►పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం
 ఎన్‌పీఎస్‌ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన
►ఎన్నోసార్లు ఆలోచించే ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం.
►అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు
►సీఎం జగన్‌ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు.
►ఉద్యోగుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యం
►ఎన్‌పీఎస్‌ హడావిడీగా తీసుకున్న నిర్ణయం కాదు
►గత కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్‌ స్కీమ్‌ను అధ్యయం చేశాం
►ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదే మెరుగైన స్కీమ్‌
►ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు పట్టించుకోలేదు
►గత ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చాం.

Back to Top