దోచుకుని దొరికితే సన్మానం చేయాలా?

స్కిల్ స్కామ్ చ‌ర్చ‌లో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అమ‌రావ‌తి:  దోచుకుని దొరికితే స‌న్మానం చేయాలా అని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే స్కిల్‌ స్కామ్‌ జరిగింది. అప్పటి కేబినెట్‌నే చంద్రబాబు తప్పుదారి పట్టించారు.. యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ప్రిజనరీగా మారారు.. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్ట్‌ చేశారు.. ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు.. బెయిల్‌ మీద వచ్చిన సుమన్‌బోస్‌కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం స్కిల్ స్కామ్‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వీడియో ప్ర‌జెంటేష‌న్ చేస్తూ మాట్లాడారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి దోపిడికి తెర లేపారు. మనకు ఇంటర్నెట్‌లో స్కిల్‌ అంశాలకు సంబంధించి చాలా వరకూ ఫ్రీగానే దొరుకుతుండగా సీమెన్స్‌ కంపెనీ రూ. 3 వేల కోట్లు ఇస్తుందంటూ కట్టు కథని చెప్పారు. ప్రభుత్వ డబ్బును బయటకు తీయడానికే ఈ పని చేశారు. ప్రభుత్వ డబ్బును రూ. 371 కోట్లు తీసేసి.. 3 వేల కోట్లు ఎవరో ఇస్తారంటూ కథలు వినిపించారు. ఇందులో చాలా క్లియర్‌గా స్కామ్‌కు తెరలేపాడు
 టెండర్లకు పోకుండా రూ. 371 కోట్లు ఎలా ప్రభుత్వ నిధులను బయటకు లాగాలానే స్కామ్‌లో భాగంగానే ఇది జరిగింది. 3వేల కోట్ల రూపాయలు ఒక సృష్టి అయితే దాని ద్వారా ఒక క్రెడిట్‌ పొందాలనే ప్రయత్నం చేశాడు బాబు. ప్రభుత్వ నిధులు లాగేయడానికి సీమెన్స్‌ కంపెనీనిని చంద్రబాబు వాడుకున్నారు.  డేట్‌ అనేది మెన్షన్‌ చేయకుండా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. తేదీ లేకుండా అగ్రిమెంట్‌ చేసుకోవడం ఒక విచిత్రం. 2015-16లో రూ. 371 కోట్లు రిలీజ్‌ చేశారు. డిజైన్‌ టెక్‌ అనేది ఒక డొల్ల కంపెనీ..ఎంఓయూ పూర్తయ్యాకే ఓ కంపెనీ స్థాపించారని మంత్రి బుగ్గ‌న తెలిపారు. కీలక పదవుల్లో గంటా సుబ్బారావును పెట్టారు. స్కిల్ స్కామ్‌లో  సుమన్‌బోస్‌ కీలక వ్యక్తి. సదరు వ్యక్తి గుజరాత్‌లో సోమేంద్ర బోస్‌ అని, ఇక్కడ సుమన్‌ బోస్‌ అని సిగ్నేచర్‌ చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి తనకు నచ్చిన ప్రైవేటు వ్యక్తిని చంద్రబాబు పెట్టుకున్నారు.ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తే మనం పట్టించుకోకుండా ఉండాలా? అని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టి నేరం చేసిన వారిని చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని కోరారు.

Back to Top