కోవిడ్‌ ఉన్నా..రాబడి తక్కువ ఉన్నా..సంక్షేమం ఆగలేదు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేశాం

రాష్ట్రంలో విద్య కోసం రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు

వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక కోసం రూ.18 వేల కోట్లు

చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకం చెప్పగలరా?

అమరావతి:  కోవిడ్‌ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా,,రాష్ట్ర రాబడి తగ్గినా..సంక్షేమం ఆగలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై మంగళవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభకు వివరించారు.
బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.29143 కోట్లు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ రూ.18518 కోట్లు, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ రూ.6,145 కోట్లు, మైనారిటీ యాక్షన్‌ ప్లాన్‌ రూ.3,662 కోట్లు, కాపు వెల్‌ఫేర్‌కు రూ.3,532 కోట్లు, ఈబీసీ వెల్‌ఫేర్‌కు రూ. 6,669 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 
డీబీటీ స్కీమ్‌ గమనిస్తే..వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకు మాత్రమే రూ.18 వేల కోట్లు, వైయస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3900 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు ఈ ఏడాది కేటాయింపులు రూ.2500, జగనన్న వసతి దీవెనకు రూ.2083, వైయస్‌ఆర్‌ ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.600 కోట్లు, కాపు నేస్తానికి రూ.500 కోట్లు, రైతులకు రూ.500 కోట్లు, జగనన్న చేదోడు పథకానికి రూ. 300 కోట్లు, వైయస్‌ఆర్‌ వాహనమిత్రకు రూ.260 కోట్లు, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం రూ.199 కోట్లు, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసాకు రూ.120 కోట్లు, మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీకి రూ.50 కోట్లు, రైతుల పరిహారం కోసం రూ.20 కోట్లు, జగనన్న తోడు రూ.20 కోట్లు, ఈబీసీ నేస్తం రూ.590 కోట్లు, వైయస్‌ఆర్‌ ఆసరా రూ.6,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తున్నాడు..మీ బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి తెస్తాడు అని ప్రచారం చేశారు. పొదుపు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటే అక్కాచెల్లెమ్మలు తీసుకొని వారికి సరైన బుద్ధి చెప్పారు.

విద్యుత్‌కు సంబందించి 2018–2019 టీడీపీ హాయాంలో చివరి ఏడాది ఖర్చు చేసింది రూ. 2,138 కోట్లు, 2019–2020వ ఏడాది మన ప్రభుత్వం రూ.11592 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం చేసిన బకాయిలు, సబ్సిడీలు అన్ని మన ప్రభుత్వమే చెల్లించింది. 2020–2021లో మన ప్రభుత్వం రూ.6110 కోట్లు ఖర్చు చేసింది. 2021–2022 రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ రూ.12,619 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాదికి మరో రూ.10146 కోట్లు కేటాయించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యకు సీఎం వైయస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఒ క్క మంచి పథకం పేరు చెప్పగలరా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.
 

Back to Top