అక్క చెల్లెమ్మలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అండగా నిలవాలి

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

14,255మంది ఆసరా లబ్ధిదారులకు రూ. 7 కోట్ల 83 లక్షల చెక్కు పంపిణీ 

 విజ‌య‌న‌గ‌రం:  మ‌హిళా సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అక్క‌చెల్లెమ్మ‌లు అంద‌రూ అండ‌గా నిల‌వాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కోరారు. శ‌నివారం ఎస్ కోట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వైయస్ఆర్ ఆసరా మూడవ విడత వారోత్స‌వాల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ,  విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),   జిల్లా కలెక్టర్ ఏ సూర్య కుమారి,  ఎస్ కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు , శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..  మ‌హిళా సాధికార‌త‌లో భాగంగా అన్ని ర‌కాల హ‌క్కులూ క‌ల్పించేందుకు సీఎం నిర్ణ‌యించారు. సాధికార‌త తాలుకా ప్ర‌యోజ‌నాలు ఇవాళ మ‌హిళ‌లు పొంద‌గ‌లుగుతున్నారు. పూర్వం ఈ విధంగా ప‌రిస్థితి అన్న‌ది ఉండేది కాదు. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మ‌గువ‌లు పాటించాలి. అలానే ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి. వైయ‌స్ఆర్ ఆస‌రాను నాలుగు విడ‌త‌ల్లో చెల్లించేందుకు వీలుగా బ్యాంక‌ర్ల‌తో మాట్లాడి ఒప్పించారు. ఇప్ప‌టికే మూడు విడత‌లు చెల్లించారు. ఇంక ఒక్క విడ‌త మాత్ర‌మే మిగిలి ఉంది. క‌నుక అది కూడా చెల్లించేస్తాం. మీరంతా సంఘాల బ‌లోపేతానికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాలి. అలానే ఆ రోజు చంద్ర‌బాబు చెప్పిన విధంగా మాట త‌ప్పిన దాఖ‌లాలు లేవు. అలానే ఆ రోజు చంద్ర‌బాబు చెప్పిన విధంగా రైతుల రుణాల విష‌య‌మై, మ‌హిళ‌ల రుణాల విష‌య‌మై జ‌గ‌న్ స్పందించి స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలుపుకున్న వైయ‌స్ జ‌గ‌న్ కూ, ఆ రోజు ఇచ్చిన మాటను మ‌రిచిపోయిన చంద్ర‌బాబుకూ మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన వ్య‌త్యాసాల‌ను గ‌మ‌నించండి. మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.  
ఈ ప్ర‌భుత్వం అన్న‌ది మ‌హిళ‌ల పక్ష‌పాతి అని మ‌రోసారి విన్న‌విస్తూ ఉన్నాను. ఇవాళ కుటుంబం అంతా హాయిగా ఉంటున్నారు. అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న గోరుముద్ద, జ‌గ‌న‌న్న విద్యా కానుక, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన లాంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ఉన్నాం. జ‌గ‌న‌న్న గోరుముద్ద పేరిట పోష‌కాహారం అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా మ‌ధ్యాహ్న భోజ‌న పథ‌కం ను  స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్నాం.  మీ పిల్ల‌ల చ‌దువులు ధ‌న‌వంతుల బిడ్ద‌ల‌తో స‌మానంగా అందేవిధంగా కృషి చేస్తున్నాం. ఇవాళ మీరు అనుభ‌విస్తున్న సౌకర్యాలు గుర్తించంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  

ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ శోభ స్వాతి రాణి, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరాము నాయుడు, ఏఎంసీ చైర్మన్ మూకల కస్తూరి, ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top